అన్నమయ్య జిల్లా: కుప్పానికి నీళ్లివ్వలేని చంద్రబాబు రాయలసీమకు ఏం చేస్తారని, సీమకు ద్రోహం చేసిన మీరు.. మిషన్లు పెడతారా..!? అని అన్నమయ్య జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని లోకేష్..చంద్రబాబు ఏం చేస్తారయ్యా..? , ఈప్రాంతానికి మీరు చేసిన పాపానికి పచ్చాత్పాపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోకేశ్ మా పరిగణలోనే లేడు..మా నినాదం 175కు 175 సీట్లు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. మిడిమిడి జ్ఞానంతో లోకేశ్..: - లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో, వ్యక్తిగత దూషణలతో, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదువుతూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ద్వారా పాదయాత్ర చేస్తున్నాడు. - పాదయాత్ర అంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడం, ప్రజలతో మమేకం అవ్వడం. - కానీ సాయంత్రం 4 గంటల వరకూ టెంటులోనే ఉంటున్నాడు. రోజుకి 19 గంటలు ఆయన టెంటులోనే గడుపుతున్నాడు. - ఒక అరగంట నడిచి...తరలించిన జనాలతో ఒక మీటింగులో పది నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతున్నాడు. - కేవలం ఆరోపణలు, దూషణలకే పరిమితమై వెళ్తున్నాడు. - కడపలో రాయలసీమ డిక్లరేషన్ అంటూ ఏదో చేస్తానని మాట్లాడాడు. - 1995లో మీ తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు...27 ఏళ్లలో 14 ఏళ్లు మీ తండ్రే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. - 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమకు ఏం చేశారు..? - మేం ముఖ్యమంత్రిగా ఉండగా రాయలసీమకు ఇది చేశాం అని చెప్పుకోలేకపోతున్నారు. - ఇప్పుడు అధికారం ఇస్తే ఏదో చేసేస్తారట... - అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ గురించి ఆలోచించకుండా, సీమవాసులంతా ఫ్యాక్షనిస్టులని, రౌడీలని దిగజారుస్తూ మాట్లాడారు. - రాయలసీమ వ్యక్తుల మనోభావాలను కించపరిచిన మీరు ఈ రోజు సీమలో ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారో సమాధానం ఇవ్వాలి. వైయస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే సీమ అభివృద్ధి: - రాయలసీమ అభివృద్ధి గురించి మాట్లాడాలంటే వైయస్ఆర్‌కు ముందు..వైయస్ఆర్ తర్వాత అనేది మాట్లాడుకోవాలి. - వైయస్ రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే రాయలసీమలో పురోగతి కనిపించింది. - తెలుగు గంగ ప్రాజెక్టును పూర్తి చేసిన వ్యక్తి రాజశేఖరరెడ్డి గారు. - హంద్రీనీవా, గాలేరు నగరిని 80 శాతం పూర్తి చేసిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి గారు. - చంద్రబాబు అధికారంలో ఉండగా హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులను సాగునీటి ప్రాజెక్టులుగా వద్దని, తాగునీటి ప్రాజెక్టులు మార్చాలని జీవోలు ఇచ్చాడు. - 2004లో ముఖ్యమంత్రిగా వైయస్ఆర్ బాధ్యత చేపట్టిన తర్వాత ఆ జీవోలను రద్దు చేసి సాగునీటి ప్రాజెక్టులుగా మార్చి 80 శాతం పూర్తి చేశాడు. - ఆ తర్వాత నువ్వు నడిపించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ, నువ్వు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పూర్తి చేయలేదు. - వైయస్ జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యాకనే గండికోట, చిత్రావతిలో పూర్తిగా నీళ్లు నిలబెట్టుకుంటున్నామంటే అది జగన్ గారి ఘనత. - రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత కేవలం వైయస్ కుటుంబానికి మాత్రమే ఉంది. - లోకేశ్ తాను చెప్పిన మాటలు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నాడు...ఆయన్ని ఒక జోకర్‌గా ప్రజలు భావిస్తున్నారు. - అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రాజెక్టుకు రూపకల్పన చేయలేని వ్యక్తి ఇప్పుడొచ్చి ఏదో చేస్తాడంటే నమ్మేది లేదు. కర్నూలు హైకోర్టుకు అడ్డుపడింది మీరు కాదా..?: - పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సీమలో జిల్లాలు పెంచారు. కర్నూలులో మేం హైకోర్టు పెడతామంటే మీరే కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి అడ్డుకున్నారు... - ఇప్పుడు అక్కడ హైకోర్టు బెంచ్ పెడతామని అవమానం చేస్తున్నావు.. - అంటే కర్నూలులో హైకోర్టును తిరస్కరిస్తున్నట్లు ఒప్పుకుంటున్నారు. - ఈయన అధికారంలోకి వస్తే స్పోర్ట్స్ హబ్ చేస్తాడట...వైయస్ఆర్ గారు ఎప్పుడో ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ పెడితే..జగన్ గారు దాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. - అనేకమైన ఆస్పత్రులు సీమకు తీసుకొచ్చింది వైయస్ కుటుంబమే. - కేవలం విమర్శలతో కాలం వెళ్లబుచ్చాలని మీరు చూస్తున్నారు. - 1994 నుంచే హంద్రీనీవా, గాలేరునగరి చేసి ఉంటే బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ద్వారా సీమకు నీటి కేటాయింపులు కూడా వచ్చి ఉండేవి. - మీరు రాయల సీమ ద్రోహులు కాదా..? - సీమ గుండె చప్పుడు లాంటి పోతిరెడ్డిపాడును మహనీయుడు వైయస్ రాజశేఖరరెడ్డి గారు యుద్ధప్రాతిపదికన రెండేళ్లలో పూర్తి చేశారు. - రాయలసీమ వాసులు చిరస్మరణీయంగా దీన్ని గుర్తు పెట్టుకుంటారు. - ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమ బాగుపడుతుందనే దుర్భుద్ధితో కృష్ణా బ్యారేజీపై నీ ఎమ్మెల్యేలతో దర్నా చేయించింది నువ్వు కాదా..? - వైయస్ జగన్ గారు సీమకు మంచి చేయాలని పోతిరెడ్డిపాడు విస్తరణ, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నిస్తే సిగ్గు లేకుండా ఈ వ్యక్తి ప్రకాశం జిల్లా శాసనసభ్యులతో సీమకు నీళ్లు తరలించుకుపోతున్నారని లేఖలు రాయించారు. కుప్పానికి నీళ్లివ్వలేని నువ్వు రాయలసీమకు ఏం చేస్తావ్..?: - కేవలం ఈవెంట్ మేనేజ్‌మెంట్‌గా నడుపుతూ కుల సంఘాల మీటింగులు పెట్టుకుంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. - నీ మాటలు, నీ వ్యవహారం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు లోకేశ్. - అలాంటి లోకేశ్ నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నాడు. - కుప్పంలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కానీ ఇప్పటి వరకూ లేదు. - కుప్పానికి నీళ్లివ్వలేని నువ్వు రాయలసీమకు ఏం చేస్తావ్..? - ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నువ్వు నీ తండ్రి ఏం చేస్తారయ్యా..? - 3 సార్లు రాయలసీమ వాసులు నీకు అవకాశం ఇస్తే వారి మనోభావాలను దెబ్బ తీసిన వ్యక్తులు మీరు. - ఈ రోజు మీరొచ్చి ఏదో చేస్తామంటే ప్రజలు నమ్మరు - వైయస్ జగన్‌గారు వచ్చిన తర్వాత కుప్పాన్ని మున్సిపాలిటీ, రెవిన్యూ డివిజన్ చేశారు. - ఇక నువ్వు రాయలసీమకు ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారు..? - ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కనీసం కనకదుర్గమ్మ ఫ్లై ఓవర్ కూడా పూర్తిచేయలేకపోతే జగన్ గారు పూర్తి చేశారు. - తాత్కాలిక భవనాలని రాజధాని లేకుండా చేసింది నువ్వే. - వైజాగ్‌ను అభివృద్ధి చేద్దామంటే ప్రతి రోజూ స్టేలు తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబుది. - విశాఖ అభివృద్ధి చెందకూడదు...అమరావతిలో ఏమీ జరగకూడదు..కర్నూలుకు హైకోర్టు రాకూడదు..ఇదే బాబు ఆలోచన. - మేనిఫెస్టోలో ఏమి చెప్పాడో దాన్ని శిరసావహిస్తూ 99 శాతం పూర్తి చేసిన వ్యక్తి వైఎస్ జగన్‌గారు. - పీఆర్సీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసిన జగన్ గారిని అభినందించాలి. లోకేశ్‌వి అన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే: - ఉత్తర కుమార ప్రగల్భాలు పలికినట్లు మిడిమిడి జ్ఞానంతో ఏదో సాధిస్తున్నాను అనుకంటే పొరపాటు. - కడప నగరం, వైయస్ఆర్ జిల్లాలో అన్ని రంగాల్లో పురోగతి సాధించింది. - నువ్వు అవకాశం ఉన్నపుడు ఏమీ చేయకుండా ఇవాళ డిక్లరేషన్ అంటున్నాడు. - సామాజిక వర్గ మీటింగులు పెట్టుకుని రెచ్చగొడుతున్నావు.. - ఏ ఆర్హతతో నువ్వు మాట్లాడుతున్నావ్ లోకేశ్..? ఏ అంశంపైనా నీకు మాట్లాడే అర్హత లేదు.. - కొప్పర్తి ఇండస్ట్రియల్‌గా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి జగన్ గారు. - లక్ష మందికి ఉద్యోగాలు వచ్చేలా అక్కడ చర్యలు చేపట్టారు. - ఆనాడు స్టీల్ ప్లాంటు పెడుతుంటే నెమళ్లు నాట్యం అంటూ అడ్డుకున్నావ్. - వైయస్ జగన్‌గారు జింధాల్ తో మాట్లాడి మళ్లీ ఇప్పుడు దాన్ని ఒక రూపునకు తీసుకొస్తున్నారు. మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..?: - దాన్ని పాదయాత్ర అంటారా..? కేవలం అది ఈవెంట్ మేనేజ్‌మెంట్. - ఈ ప్రాంతం మీ వల్ల ఎంత నష్టపోయింది అనేది మీరు ఆలోచన చేస్తూ పాదయాత్ర చేయాలి. - మీ 15 ఏళ్ల పరిపాలనలో సీమ ప్రజలకు మీరు చేసిన అన్యాయానికి క్షమాపణలు చెప్పుకుంటూ తిరగాలి. - ఇచ్చిన మేనిఫెస్టోనే కనిపించకుండా చేసిన వాళ్లు ఏదో చేస్తారంటే నమ్మడం ఎలా..? - ఆయన చేసిన మొదటి సంతకాలు ఏమయ్యాయి..? - ఇప్పుడు మళ్లీ ఆల్ ఫ్రీ బాబులా హమీలిస్తున్నాడు. - వైయస్ జగన్ గారు ఇస్తున్న స్కీమ్‌ల పేరు మార్చి హామీలిస్తే సరిపోదు. - ఈ బాధ్యత లేని వ్యక్తులు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారో ఆలోచించండి. - సిగ్గు లేకుండా పిల్లల్ని పుట్టించుకోండి..ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తానంటాడు. - గతంలో ఇదే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంటే వెనిజులా, శ్రీలంక అయిపోతుంది అన్నాడు. - ఇప్పుడు అవే హామీలిచ్చి ఎల్లో మీడియాతో భజన చేయించుకుంటున్నాడు. - వైయస్ జగన్ గారు మీకు మంచి జరిగితేనే నన్ను ఆశీర్వదించండి అంటున్నారు. - ఈ మాట చంద్రబాబు చెప్పగలడా..? తండ్రీ కొడుకులది డ్రామా పాదయాత్ర: - అన్ని రంగాల్లో రాయలసీమను మోసం చేసి, సామాజిక వర్గాలను కించపరిచి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. - పాదయాత్ర అంటే వైయస్ఆర్, వైయస్ జగన్ గారిని చూసి నేర్చుకో లోకేశ్. - నీ తండ్రిలా అప్పటికప్పుడు మట్టిరోడ్లు వేయించి రాత్రి పూట నడవడం కాదు. - తండ్రీ కొడుకులది డ్రామా పాదయాత్ర. - లోకేశ్ పాదయాత్ర రెండు రోజుల్లో రాయలసీమను వీడనుంది. - మీరు చేసిన తప్పునకు ఈ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పాలి. - సీమ వాసులను ఫ్యాక్షనిస్టులు అన్నాం..క్షమించండి అని కోరండి. - పోతిరెడ్డిపాడును ఆనాడు వ్యతిరేకించాం...సీమ ప్రజలు క్షమించండి అని చెప్పి వెళ్లు. - నేను పదేళ్లలో చేయకపోవడం వల్లే సీమకు నీటి కేటాయింపులు రాలేదని క్షమాపణ చెప్పి వెళ్లాడు. - కర్నూలు ఎయిర్ పోర్టు అని శంకుస్థాపన చేసి ఏదో చేసినట్లు చెప్పుకుంటున్నారు. - దానికి రూ. 280 కోట్లలో రూ. 180 కోట్లు జగన్ గారే విడుదల చేసి ముందుకు సాగించారు. - ఓర్వకల్లులో నిర్మిస్తున్న పారిశ్రామికవాడ, కొప్పర్తి సెజ్, శ్రీ సిటీల్లో మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో...మా హయాంలో ఎన్ని వచ్చాయో చూసుకో. - నీ ముక్కు నేలకు రాసి...రాయలసీమ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. - చంద్రబాబు కూడా సీమకు వచ్చి కొడుకుతో పాటు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. సామాజికవర్గాల ప్రస్థావన చంద్రబాబుతోనే ప్రారంభం: - గత నాలుగేళ్లలో రెడ్డి సామాజిక వర్గాన్ని చంద్రబాబు కించపరిచేలా మాట్లాడారు. - అధికారంలో ఉన్నపుడు పత్తికొండ నారాయణరెడ్డిని, రాప్తాడు ఎమ్మార్వో ఆఫీసులో రెడ్డి సామాజిక వర్గ వారిని హత్యలు చేయించింది వీళ్లు కాదా..? - వందల మంది రెడ్డి సామాజికవర్గీయులను హత్యలు చేసిన వీళ్లు ఇప్పుడు రెడ్లపై ప్రేమ ఒలకబోస్తే ఎట్లబ్బా..? - సామాజిక వర్గాల గురించి మాట్లాడే పరిస్థితి చంద్రబాబుతోనే ప్రారంభం అయ్యింది. - మేం ప్రతి సామాజికవర్గాన్నీ సమానంగా చూస్తున్నాం. అన్ని వర్గాలకూ మేం సంక్షేమాన్ని అందిస్తున్నాం. - అన్ని వర్గాలకు శ్యాచురేషన్ స్థాయిలో సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్నాం. - అన్ని కులాలను సమానంగా చూసేవాడు రాజకీయ నాయకుడు. - కుట్రపూరితంగా అధికారంలోకి రావాలని సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టడం కాదు. - అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో ప్రభుత్వాన్ని నడిపించే వాడు అసలైన నాయకుడు. - సినిమాల్లో వాళ్లకి తెలిసిన వారితో దొంగలు, దోపిడీదారులుగా చిత్రీకరించింది మీరే కాదా..? సీమను కించపరిచి మళ్లీ డిక్లరేషనా..?: - చేసిన తప్పునకు క్షమాపణ చెప్పమని అడుగుతున్నాం. కానీ ఆయనేదో పరిణితి చెందాడని, ఆయనకు భయపడి కాదు. - ఈప్రాంతానికి చేసిన పాపానికి పచ్చాత్పాపడి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. - లోకేశ్ మా పరిగణలోనే లేడు..మా నినాదం 175 సీట్లే. - చంద్రబాబు హయాంలో ఫ్యాక్షన్ ఉంది. రాజశేఖరరెడ్డిగారు వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ వద్దు..ఫ్యాషన్ ముద్దు అంటూ నిర్మూలించారు. - పరిటాల రవి హాయాంలో వేలమందిని మాయం చేసేశారు. ఎక్కడ చూసిన బాంబులు వేయించింది మీ చరిత్ర. - ఫ్యాక్షన్ రూపుమాపింది వైఎస్ రాజశేఖరరెడ్డి గారే. - అక్కడెక్కడో ట్రైన్ కాలిపోతే రాయలసీమ గూండాలు అన్నది మీరు కాదా..? - ఈ రోజు మీకు సీమ డిక్లరేషన్ చేసే అర్హత ఉందా..? - భవిష్యత్తులో ఏ పార్టీ వాడైనా, ఏ ప్రాంతం వాడైనా సినిమాల్లోనైనా, ఎక్కడైనా సరే సీమ సంస్కృతి, సామాజికవర్గాలను కించపరిస్తే ఇంతకు ముందులా ఊరుకునేది లేదు. - ఇక నుంచి సినిమాల్లో మా సంస్కృతిని కించపరచడం చూస్తే మాత్రం ఎంతటివారైనా సహించేది లేదు. - సీమలో 52కి 52 గెలుస్తాం...రాష్ట్రంలో 175కి 175 గెలుస్తామని శ్రీకాంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.