పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతీఒక్కరికీ ప్లీనరీ ఓ పండుగ

వైయస్‌ఆర్‌ సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: పార్టీని కన్నతల్లిగా భావించే ప్రతి ఒక్కరికీ జూలై 8, 9వ తేదీల్లో నిర్వహించే ప్లీనరీ సమావేశాలు అపురూపమైన పండుగగా నిలబడిపోతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆత్మాభిమానం, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం ఏర్పడిన వైయస్‌ఆర్‌ సీపీ.. అనాతికాలంలోనే ప్రజాధరణ చురగొని.. దేశంలో చరిత్ర సృష్టించే విధంగా అధికారంలోకి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే 95 శాతం హామీలు చేసిన సీఎం వైయస్‌ జగన్‌.. చరిత్ర సృష్టించారన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలో వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను గడికోట శ్రీకాంత్‌రెడ్డి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారీ ఎత్తున ప్లీనరీ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వైయస్‌ఆర్‌ కుటుంబ సభ్యులు లక్షలాది మంది వచ్చినా ఎలాంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించనున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ రెండ్రోజులు పూర్తిగా ప్లీనరీ సమావేశాల వద్దే ఉంటారని, రాబోయే కాలానికి దిశానిర్దేశం చేస్తారన్నారు. ప్లీనరీ సమావేశాల కోసం తరలివచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త ఎదురుచూస్తున్నారన్నారు. 

గత ప్లీనరీలో పార్టీ ఎజెండాను వివరించాం. ఈ ప్లీనరీలో అధికారంలోకి వచ్చాక ఏం చేశాం.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామనేది చెబుతామని ఎమ్మెల్యే గడికోట వివరించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు కేవలం ఇతరులను దూషించేందుకు ఏర్పాటు చేశారని, ప్రజల పట్ల టీడీపీకి ఎలాంటి అవగాహన ఉందో అర్థమైపోయిందన్నారు. రాజకీయాలు అంటే కేవలం ఎన్నికలే కాదు.. ప్రజాసేవ కూడా అనేది టీడీపీ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను చూసి ఓర్వలేక ప్రతినిత్యం బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. 
 

తాజా వీడియోలు

Back to Top