ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ధ‌ర్మాన 

శ్రీకాకుళం :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాద రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత నాలుగు రోజులుగా రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవలు చక్కగా ఉన్నాయని, ప్రజలు ప్రభుత్వ వైద్య సేవలు ఉపయోగించుకోవాలని ఆయన శుక్ర వారం ఒక ప్రకటనలో కోరారు.  రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుందని ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగు పడ్డాయని, మంచి సేవలు లభిస్తున్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని ఆయన కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా మంచి వైద్య సేవలు లభ్యం అవుతున్నాయని ప్రజలు గ్రహించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో ఆక్సీజన్ సౌలభ్యంతో పాటు అన్ని మందులు లభిస్తాయని, నిపుణులు అయిన వైద్యులు ఉన్నారని ఆయన తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top