అసెంబ్లీ: పాత రోజుల్లో బోర్ల దగ్గర మహిళలు బిందెల గలాట జరిగినట్లుగా.. ప్రతి రోజు మహిళల్లా స్పీకర్ పోడియం వద్దకు టీడీపీ సభ్యులు వచ్చి నిల్చోని గందగోళం సృష్టిస్తున్నారని వైయస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అన్నారు. స్పీకర్ ఒక్కరా.. లేక నలుగురా..? అన్నట్లుగా మైక్ దగ్గర నిలబడుతూ రచ్చ చేస్తున్నారి మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలు మొదలైన నాటి నుంచి టీడీపీ ఇదే పరిస్థితి కొనసాగిస్తుందన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘టీడీపీ సభ్యుల కెప్టెన్ చంద్రబాబు ఎవరు ఎంత అరుస్తారో.. వారికి మార్కులు వేస్తున్నట్లుగా ఉన్నారు. అందుకే వారంతా ప్రతి రోజు స్పీకర్ పోడియం వద్దకు చేరి గలాటా చేస్తున్నారు. అసెంబ్లీ అనేది ఒక దేవాలయం.. ప్రజా ప్రభుత్వం వచ్చింది.. ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. వాళ్లు చేసినట్లుగా మనం చేస్తే బాగుండదు.. సభా సంప్రదాయాలు పాటించాలని సీఎం వైయస్ జగన్ మాకు చెప్తుంటారు. చంద్రబాబు ప్రజల స్వచ్ఛందంగా వేసిన ఓటుతో గెలవలేదు.. పెరుక్కున్న పార్టీ అది. చంద్రబాబు రూ.3 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయాడు. అయినా.. ప్రజలంతా బాగుండాలని సీఎం వైయస్ జగన్ ప్రతీ స్కీమ్ ఆలోచించుకోని అమలు చేస్తున్నారు. రాష్ట్రం ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తున్నారు. హైదరాబాద్‌ను కోల్పోయిన పరిస్థితి మళ్లీ రాకూడదని సీఎం ఆలోచన చేస్తున్నారు. ఒక తండ్రికి ముగ్గురు పిల్లలు ఉంటే.. పిల్లలకు ఎలా సమానంగా న్యాయం చేయాలో.. అలా సీఎం జగనన్న ఆలోచన చేస్తున్నారు. రాబోయే తరాలకు సీఎం వరాలు ఇస్తున్నారు. ఇది కొందరికి ఇష్టం లేకుండా పోతుంది. అబద్ధాల కోటకు చైర్మన్ చంద్రబాబు. అబద్ధాలతోనే 2014లో అధికారంలోకి వచ్చారు. సీఎం వైయస్ జగన్ మంచి పనులు చేస్తుంటే టీడీపీ సభ్యుల కడుపు మండిపోతుంది. కాబట్టి దయచేసి సభలో గందరగోళం సృష్టిస్తున్న వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి.