కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు వైయ‌స్ఆర్‌సీపీతోనే ..

ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖ‌:  త‌న కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయ‌స్ఆర్‌సీపీతోనే ఉంటానని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. త్వరలో టీడీపీలోకి వెళ్లిపోతున్నానని, అనకాపల్లి నుంచి పోటీ చేస్తానని పలువురు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని ముత్తంశెట్టి శ్రీ‌నివాస‌రావు తీవ్రంగా ఖండించారు. మధురవాడలో జరిగిన ఆసరా, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకులు మైండ్‌ గేమ్‌ ఆడుతూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షనేతలకు పుట్టగతులుండవని, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.   

Back to Top