కార్పొరేట్ కు ధీటుగా వైద్య సేవలు...

  ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి  

అనంతపురం: కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తామని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో మానవతా రక్తదాత స్వచ్ఛంద సేవా సంస్థ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తం నిల్వ చేసే పరికరాలను,లక్ష్య సర్టిఫికెట్ గ్రూప్ ఆమోదం పొందిన అత్యాధునిక సదుపాయాల కార్పొరేట్ స్థాయి  లేబర్ రూమ్ బ్లాక్,గైనకలజీ విభాగం ఆపరేషన్ టీయేటర్ ను సూపరింటెండెంట్ జగన్నాథం,వైద్యకళాశాల ప్రిన్సిపాల్ నీరజా,డి.యం. హెచ్ఓ కామేశ్వర ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎంపీ రంగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..గతంతో పోలిస్తే ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మెరుగుపడ్డాయని చెప్పారు.ముఖ్యమంత్రి గా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టగానే విద్య,వైద్యం పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని తెలిపారు.ప్రైవేట్,కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా పేదలకు మెరుగైన వైద్యం అందించేలా సర్వజనాస్పత్రి ని అభివృద్ధి చేస్తున్నారని స్పష్టం చేశారు.ఇప్పటికే నాడు నేడు పథకం ద్వారా రూ.55 కోట్లతో ఆస్పత్రిలో ఆధునికీకరణ పనులు చేపట్టారని తెలిపారు.అంతేకాకుండా గర్భిణులు,చిన్నపిల్లలకై ప్రత్యేకించి రూ.300 కోట్లతో ఎంసీహెచ్ బ్లాక్ ను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.జిల్లా నలుమూలల నుండి పేదలు ఉచిత వైద్య సేవల కోసం సర్వజనాస్పత్రి కి వస్తుంటారని వారికి బెడ్ల కొరత రాకుండా తగు చర్యలు చేపట్టాలని వైద్య సిబ్బందికి ఆదేశించారు.కోవిడ్ థర్డ్ వేవ్ ఊహాగానాలు నేపథ్యంలో దానిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు.అనంతపురం లో గత 20 సంవత్సరాలుగా  మానవతా రక్త దాత స్వచ్ఛంద సేవా సంస్థ నేతృత్వంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని,వారి సేవ స్పూర్తి అభినందనీయం అని ప్రశంసించారు.కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ నిసార్ అహ్మద్,వైద్య సిబ్బంది మల్లీశ్వరి,ఆత్మరామ్,మానవతా రక్తదాత సేవ సంస్థ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Back to Top