ఎన్టీఆర్, పవన్‌లను మించిన నటుడు చంద్రబాబు

ప్రభుత్వంపై బురదజల్లేందుకు బాబు, పవన్‌ కుట్రలు

వైయస్‌ఆర్‌ హయాంలో లేని మతప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది

పవన్‌కు ప్యాకేజీలు ఎక్కడి నుంచి అందుతున్నాయో ప్రజలకు తెలుసు

వెనకబడిన కులాలు మా వెంట ఉన్నాయి కాబట్టే 151 సీట్లు ఇచ్చారు

కేసీఆర్‌ కేకకు చంద్రబాబు భయపడి అమరావతి వచ్చాడు

చంద్రబాబు, పవన్‌ల తప్పుడు ప్రచారాలను ప్రజలు విశ్వసించరు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: ఎన్టీఆర్, పవన్‌లను మించిన మహానటుడు చంద్రబాబు. అనుభవం అని చెప్పుకునే వ్యక్తి దీక్షలతో డ్రామాలు ఆడుతున్నాడు. అధికారం పోయిన ఆరు నెలల్లోనే పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. పనిగట్టుకొని పవన్, చంద్రబాబులు మతప్రస్తావన తీసుకువస్తున్నారని మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో లేని మత ప్రస్తావన ఇప్పుడెందుకు వస్తుందని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ ఏ మతమో.. వైయస్‌ జగన్‌ది అదే మతమని, పాదయాత్రకు ముందు, పాదయాత్ర పూర్తయిన తరువాత వైయస్‌ జగన్‌ తిరుమల వెంకటేశ్వరస్వామిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ పారదర్శక పాలన చూసి ఓర్వలేక చంద్రబాబు, పవన్‌ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 23 బాంబులు పెట్టినా భయపడలేదని చెప్పుకుంటున్న చంద్రబాబు.. కేసీఆర్‌ ఒక్క మాట అనగానే భయపడి హైదరాబాద్‌ నుంచి అమరావతికి ఎందుకు వచ్చారో చెప్పాలన్నారు. పవన్‌ కల్యాన్‌కు ప్యాకేజీలు ఎక్కడి నుంచి ముడుతున్నాయో ప్రజలందరికీ బాగా తెలుసన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘చంద్రబాబు దత్తపుత్రుడిగా పేరుగాంచిన పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌ మార్చ్‌ చేశారు. ఇదంతా దేనికి చేస్తున్నారంటే ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నాడు. ప్రభుత్వం ఇసుక కృత్రిమంగా కొరత సృష్టించిందని, కార్మికులను కావాలనే ఇబ్బంది పెడుతున్నారనే మాటలు కూడా మాట్లాడారు. అదే విధంగా చంద్రబాబు కొన్ని ఆరోపణలు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌కు డబ్బు పిచ్చి అని, లిక్కర్‌ ధరలు పెరిగిపోయి సామాన్యుడు ఇబ్బందులు పడుతున్నారని, లిక్కర్‌లో జేట్యాక్స్‌ పెట్టి డబ్బు కాజేస్తున్నారని మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులు చనిపోయినా వైయస్‌ జగన్‌ వీడియో గేమ్‌లు ఆడుకుంటున్నారని, వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌ సీపీకి, వైయస్‌ఆర్‌కు వెనుకబడిన కులాలు అంటే బాగా కోపం అని, వెనుకబడిన కులాల మీద కక్ష తీర్చుకోవడం కోసమే ఇసుక కొరత సృష్టించారని పిచ్చిపిచ్చి మాటలన్నీ చంద్రబాబు ఫ్రెష్టేషన్‌లో మాట్లాడుతున్నాడు.

అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు కంగారుపడే స్థితిలో ఎందుకు ఉన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత అవినీతి తగ్గించాలనే ప్రయత్నం చేస్తున్నారు. చిత్తశుద్ధితో పనిచేస్తుంటే జేట్యాక్స్‌ అంటున్నారు. చంద్రబాబు, లోకేష్, ఎమ్మెల్యేలు గత ఐదేళ్లు ఇష్టం వచ్చినట్లుగా వసూళ్లకు పాల్పడితే జనం చీకొట్టి 23 సీట్లకు పరిమితం చేశారు. వైయస్‌ జగన్‌ పారదర్శక పాలన చేస్తున్నారు. వేదిక దొరికిందని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకోం.

Read Also: అందరికీ నాణ్యమైన వైద్యం
 
దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తాం. లిక్కర్‌ పట్టుకుంటేనే షాక్‌ కొట్టేలా చేస్తాం. సామాన్యుడికి లిక్కర్‌ అందుబాటులో లేకుండా చేస్తాం. ఆ ప్రకారమే ముందుకు వెళ్తాం. మద్య నిషేధంతో కుటుంబాలు బాగుపడతాయని సీఎం వైయస్‌ జగన్‌ ఆయన పాదయాత్రలో జనం నుంచి తెలుసుకున్నారు. మందుబాబుల సంఖ్య తగ్గాలనేది మా కోరిక.
అన్నాక్యాంటీన్లు ఆపేశారని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. అన్నా క్యాంటీన్లు ఎప్పుడు పెట్టారు. ఎలక్షన్‌కు ఎన్ని రోజుల ముందు తీసుకువచ్చారు. చంద్రబాబులా మోసం చేయడం వైయస్‌ జగన్‌కు రాదు. ఇచ్చిన వాగ్దానాలను ఎన్నికలు అయిన వెంటనే అమలు చేస్తూ చిత్తశుద్ధితో వైయస్‌ జగన్‌ ముందుకెళ్తున్నారు. మంచిని మంచి అనలేని దృక్పథంలో చంద్రబాబు ఇవాళ వెర్రెక్కి మాట్లాడుతున్నారు.

కాకినాడలో భవనకార్మికుడు ప్రమాదవశాత్తు కిందపడిపోతే లోకేష్‌ వెళ్లి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని శవ రాజకీయాలు చేస్తున్నాడు. ధర్మంగా వ్యవహరించకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. వెనుకబడిన వర్గాలంటే వైయస్‌ జగన్‌కు, వైయస్‌ఆర్‌కు కక్ష అంట. దాని వల్లే ఇసుక కొరత సృష్టించారంట. చంద్రబాబు, పవన్‌ పొంతన లేకుండా మాట్లాడుతున్నారు. వెనుకబడిన వర్గాలు మూకుమ్మడిగా వైయస్‌ జగన్‌కు ఓట్లు వేశారు కాబట్టే 151 సీట్లు వైయస్‌ఆర్‌సీపీకి వచ్చాయి. చంద్రబాబు దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ దేవాలయంలో తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నాడో లేదో అని మాట్లాడుతున్నాడు. వైయస్‌ఆర్‌ హయాంలో లేని మత ప్రస్తావన ఇప్పుడెందుకు వచ్చింది. వైయస్‌ఆర్‌ అనేకసార్లు తిరుపతి వెళ్లారు. వైయస్‌ఆర్‌ ఉన్నప్పుడు ఎందుకు రాలేదు ఈ విమర్శలు. పనిగట్టుకొని పవన్, చంద్రబాబు ఇద్దరూ కలిసి వైయస్‌ జగన్‌పై మతప్రస్తావన చేస్తున్నారు.
 
పాదయాత్రకు ముందు వైయస్‌ జగన్‌ వెంకటేశ్వరస్వామి దగ్గరకు కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. పాదయాత్ర పూర్తయిన తరువాత కూడా కాలినడకన వెళ్లి దర్శనం చేసుకున్నారు. వైయస్‌ జగన్‌కు దేవుడంటే విశ్వాసం ఉంది. ఎక్కడైనా స్తంభం కనిపిస్తే అది శిలువ అని కొన్ని పత్రికల్లో రాయడం దానికి చంద్రబాబు దరువు వేస్తున్నాడు. వైయస్‌ జగన్‌ హిందూ వ్యతిరేకి అని ముద్రవేయాలని చూస్తే ప్రజలు, మతాలు క్షమించవు.

లోకేష్‌ మూడుసార్లు సీఎం డౌన్‌ డౌన్‌ అంటే.. చంద్రబాబు దగ్గర నుంచి ఇద్దరు జారిపోయారు. లోకేష్‌ నోరు మంచిది కాదు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అను ఆయన పెరుగుతారు. ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ప్రచారం చేయాలనే ప్రయత్నం సమంజసం కాదు.

చంద్రబాబు తానా అంటే పవన్‌ తందానా అంటున్నాడు. చంద్రబాబు ఆదేశాల మేరకు వైయస్‌ఆర్‌ సీపీ, సీఎం వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తున్నాడు. రాజకీయ విమర్శలు చేస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు.  పైకి పాలసీల మీద మాట్లాడుతున్నానని పవన్‌ చెబుతున్నాడు.. వైయస్‌ జగన్‌ జైల్లో ఉన్నారు. విజయసాయిరెడ్డి సూటికేసుల కంపెనీలు అని మాట్లాడడం పాలసీలపై మాట్లాడడం అంటారా..? తాటతీసి మూలన కూర్చోబెడతాను. ఇవన్నీ పాలసీ మాటలు అంటారా.. వ్యక్తిగతం అంటారా..? కనీసం ఇంగింత జ్ఞానం కూడా లేదా పవన్‌ కల్యాణ్‌..?

చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసి వైయస్‌ జగన్‌ను ఏం చేయాలనుకుంటున్నారు.  అటు ఇటు ఎటైనా మేమంతా వైయస్‌ జగన్‌ వెంటే నడుస్తాం. వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు పవన్‌కు లేవు. పెళ్లిళ్లు మీరు కూడా చేసుకోండి అని మాట్లాడుతున్నాడంటే సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు. బొత్స సత్యనారాయణ విమర్శిస్తే మూడు నెలల్లో మంత్రి పదవికి కొనసాగింపు ఉంటుందని పవన్‌ మాట్లాడుతున్నాడు. వైయస్‌ జగన్‌పై ఎగేసుకొని విమర్శిస్తున్న పవన్‌కు ఎక్కడి నుంచి ప్యాకేజీ వస్తుందని ఎవరిని అడిగినా చెబుతారు.
ముందు జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకోండి. తెనాలిలో ఉన్న బాబు, లింగమనేని బాబు కలిసి చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లి ప్యాకేజీలు మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు ఎవరు చెబితే వారికి టికెట్లు ఇచ్చి మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారు.

చంద్రరాబు, పవన్‌ ఇద్దరూ ఇసుక గురించి, ఇంగ్లిష్‌ గురించి మాట్లాడుతున్నారు.
ఇసుకలోంచి రాజకీయ తైలం తీయాలని ప్రయత్నం చేయడం ధర్మం కాదు. ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడితే తప్పేంటీ..? మీ పిల్లలు, మా పిల్లలు అంతా ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతారు.. పైకి తెలుగు భాష కోసం పోరాడుతామని ఫోజులు ఎందుకు పవన్‌. ఇది సరైన విధానం కాదని తెలుసుకోండి. ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేయడం సమంజసం కాదు.
 
23 బాంబులు పెట్టినా భయపడలేదు అంటున్నాడు.. కేసీఆర్‌ ఒక్క మాట అంటే భయపడి పారిపోయి వచ్చావు. ఏంటీ నీ ధైర్యం చంద్రబాబూ. 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను కేసీఆర్‌ కేకకు భయపడి పారిపోయి వచ్చావు. అమరావతి అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావు. భ్రమరావతి నిర్మించావు. అమరావతిలో కొన్ని వేల కోట్లు కాజేసి దొంగ జపం చేస్తే ప్రజలు నమ్మర చంద్రబాబూ అని అంబటి చురకలు అంటించారు.

Read Also: అందరికీ నాణ్యమైన వైద్యం

Back to Top