జగనన్న చూపిన ఈ బాటలో అందరం న‌డుద్దాం

ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్‌.కే) 

మంగ‌ళ‌గిరి:  ఆకుపచ్చని ఆంధ్రావనే లక్ష్యంగా జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం నిర్వ‌హిస్తున్న‌ట్లు మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి పేర్కొన్నారు.  వనమహోత్సవానికి మంగళగిరి నియోజకవర్గం విచ్చేసిన సీఎంగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జగనన్న చూపిన ఈ బాటలో అందరూ నడవాలని కోరారు.  రాష్ట్రంలో పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా వృక్షంలా తయారయ్యేందుకు అందరూ కృషిచేయాలి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళేలా మనం రాష్ట్రంలో ప్రతీ రోజూ వీలైనంత మేరకు మొక్కలు నాటాలి. వాతావరణ సమతుల్యం, వాతావరణ కాలుష్యం తగ్గడానికి, ఆక్సీజన్‌ అవసరం కూడా తెలుసుకున్నాం కాబట్టి, మొక్కలు, వృక్షాలు అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మనం తలంచి మొక్కలు విరివిగా పెంచాలి అని ఎమ్మెల్యే ఆర్కే కోరారు. 
 

Back to Top