రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో చేశారు

ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
 

అమరావతి: రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో చేశారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు..వైయస్‌ జగన్‌ దాన్ని పండుగ చేస్తున్నారు. వైయస్‌ జగన్‌ పాలనలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని చెప్పారు. రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ ఎన్నో చేశారని గుర్తు చేశారు.
ధాన్యం సేకరణకు చంద్రబాబు హయాంలో చేసిన ఖర్చు కంటే వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు చేస్తుందని చెప్పారు. 55 వేల కోట్ల ధాన్యాన్ని సేకరించారు. విత్తనం నుంచి పంట వరకు అన్నీ ప్రభుత్వమే రైతులను చేయ్యి పట్టి నడిపిస్తోందన్నారు. విద్యుత్‌పై ఎద్దేవా చేసిన చంద్రబాబుకు దమ్ముంటే ఆ తీగలను పట్టుకోవచ్చు. చెరువుకు, చేనుకు, ఎకరాకు, హెక్టారుకు తేడా తెలియని వ్యక్తులు ఇవాళ పాదయాత్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెడుతూ మమ్మల్ని విమర్శించడం సరికాదని హితవు పలికారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు ఒక వైపు ఉ ంటే..రైతులకు అండగా నిలిచిన వైయస్‌ జగన్‌ మరోవైపు ఉన్నారని తెలిపారు. ప్రత్యేక పంటలుగా ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో హైబ్రిడ్‌ సీడ్స్‌కు సంబంధించి పొద్దుతిరుగుడు, కోటం, ప్యాడీ, జొన్న వంటికి తయారు చేస్తున్నామని తెలిపారు. సీడ్‌ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం  నిలిచిందని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి చెప్పారు. 
 

Back to Top