పశ్చిమగోదావరి: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి పాదయాత్ర చేపట్టారు. శుక్రవారం తెల్లవారుజామున రెండు గంటలకు ఆయన పెదవేగి మండలం రాట్నాలకుంట రాట్నాలమ్మ తల్లి దేవాలయం నుంచి పాదయాత్రగా ద్వారకా తిరుమల చేరుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు: రాష్ట్రంతో పాటు, దెందులూరు నియోజకవర్గంలో వైయస్ఆర్‌సీపీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్ల పాలన విజయవంతంగా సాగాలంటూ పాదయాత్ర చేసినట్లు తెలిపారు. ఈ ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు ‘నవరత్నాలు’ పూర్తి స్థాయిలో అందేలా కృషి చేస్తా.’ అని హామీ ఇచ్చారు.