ప్రజల తలరాతను మార్చే బడ్జెట్‌ తెచ్చాం

ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావిస్తాం

అవినీతి రహిత పాలన దిశగా సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు

ఊరు మారినా, ఇల్లు మారినా ప్రయోజనం లేదు బాబు తీరు మారాలి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

అమరావతి: మేనిఫెస్టోను ఖురాన్, భగవద్గీత, బైబిలా భావించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతి అంశాన్ని నెరవేరుస్తామన్నారు. కానీ, 2014లో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో చూద్దామన్నా ఎక్కడా కనిపించలేదన్నారు. టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి.. నెట్‌లో నుంచి తీసేశారన్నారు. కారణం.. టీడీపీ మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్ని చంద్రబాబు అమలు చేసిన దాఖలాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఐదు కోట్ల ఆంధ్రరాష్ట్ర ప్రజల తలరాతను మార్చే బడ్జెట్‌ అన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే మంచి చేస్తానని భరోసా ఇచ్చారు. భగవంతుడి ఆశీర్వాదం, ప్రజల దీవెనలతో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అవినీతి రహిత పాలన దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడుగులు వేస్తున్నారన్నారు. మరో 30 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగేలా ప్రజలందరికీ మేలు చేస్తున్నారన్నారు. బలహీనవర్గాలకు ఈ బడ్జెట్‌ పెద్దపీట వేసిందన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం రూ. 15 వేల కోట్లు కేటాయించామన్నారు. నాయీ బ్రాహ్మణులకు రూ. 10 వేలు ఇచ్చేందుకు రూ. 200 కోట్లు కేటాయించామని,  మైనార్టీల సంక్షేమానికి రూ. 2 వేల కోట్లు కేటాయించామన్నారు. 

కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు మోసం చేశారని అంబటి ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వంలో కాపులను అరెస్టు చేసి జైల్లో పెట్టారని, తుని ఘటనలో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులపై కేసులు పెట్టారన్నారు. కాపులను దశలవారీగా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు ఊరు మారినా.. ఇల్లు మారినా.. ప్రయోజనం లేదని, ముందు బాబు మారితేనే ప్రయోజనమని అంబటి సూచించారు.  

 

Back to Top