సమ­ర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందాం

రాష్ట్రంలో ఒక్క బీఎఫ్‌-7 కేసూ న‌మోదు కాలేదు

60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి

రాష్ట్రంలో 37 వేల ప్రికాషనరీ డోస్‌ వ్యాక్సిన్లు అందు­బా­టులో ఉన్నా­యి

కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేలా త‌గిన చ­ర్య­లు తీసు­కో­వాలి

వైద్య, ఆరోగ్య శాఖ అధికారుల‌కు మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశం

విశాఖప‌ట్నం: రాష్ట్రం­లో ఒకవేళ కోవిడ్‌ బీఎఫ్‌–7 వేరియంట్‌ ప్రభావం చూపితే సమ­ర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని ఉన్నతాధికారులను ఆదేశించారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశాల మేరకు విశాఖపట్నం నుంచి వైద్య ఆరోగ్య శాఖ ఉన్న­తాధికారులు, అన్ని విభాగాల అధిపతులు, ఆయా విభాగా­ల జిల్లా స్థాయి అధికారులతో జూమ్‌ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి విడుద‌ల ర‌జిని స‌మీక్ష నిర్వ‌హించారు. స‌మీక్ష అనంతరం మీడియాతో మాట్లాడారు. కోవిడ్‌ మూడు దశలను ఎదుర్కోవడంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తు చేశారు. మరోసారి కోవిడ్‌ ముప్పు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అంతా సిద్ధంగా ఉండాలన్నారు. కోవిడ్‌ ప్రభావం ప్రజలపై ఏ మాత్రం పడకుండా ముందునుంచీ సీఎం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 

ఒక్క బీఎఫ్‌–7 కేసు కూడా నమోదు కాలేదు
రాష్ట్రంలో ప్రస్తుతానికి కోవిడ్‌ కొత్త వేరియంట్లు ఎక్కడా నమోదు కాలేదు. ఒక్క బీఎఫ్‌–7 కేసు కూడా నమోదు కాలేదు. విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ పరీక్షల ల్యాబ్‌­లో బుధవారం నుంచే పరీక్షలు చేస్తు­న్నాం. రాష్ట్రంలో 37 వేల ప్రికాషనరీ డోస్‌ వ్యాక్సిన్లు అందు­బా­టులో ఉన్నా­యి. ఇంకా అవసరమైన మేరకు తెప్పిస్తు­న్నాం. 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలి. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్ల ద్వారా ప్రజలను అప్ర­మత్తం చేయాలని ఆదేశించాం. విధిగా మాస్క్‌లు ధరించేలా చూడాలి. బీఎఫ్‌–7­ను ఎదుర్కొనే విషయమై వై­ద్యా­ధికా­రులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఎక్కువ సంఖ్యలో టెస్ట్‌లు చేయాల్సి వస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 29 ల్యాబ్‌లు ఉన్నాయి. పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు సిద్ధం చేశాం. అత్యవసరమైతే ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రులు కూడా అందుబాటులోకి తెస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల బెడ్స్‌ సిద్ధం చేశాం.

ఆక్సిజన్, మందులు, వెంటిలేటర్లు, ర్యాపిడ్‌ కిట్లు వంటివి కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలి. రాష్ట్రంలో ప్రస్తుతం 15.19 లక్షల ఆర్టీపీసీఆర్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయి, అవసరమైతే మరిన్ని కొనుగోలు చేయాలి. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి నేపథ్యంలో బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్లు, ఎయిర్‌పోర్టుల్లో రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆయా చోట్ల కోవిడ్‌ వ్యాప్తిని అరికట్టేలా చ­ర్య­లు తీసు­కో­వాలి. 104 కాల్‌ సెంటర్‌  సామర్థ్యాన్ని మరింతగా పెంచాలి.

Back to Top