టీడీపీ హయాంలో ఈనాడుకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్ల యాడ్స్‌ 

నిబంధనలను తుంగలో తొక్కి ఆంధ్రజ్యోతికి రూ.72 కోట్ల యాడ్స్‌

చంద్రబాబు హయాంలో యాడ్స్‌ కోసం రూ.449 కోట్లు ఖర్చు 

మా ప్రభుత్వంలో ఇప్పటి వరకు రూ.128 కోట్ల యాడ్స్‌ ఇచ్చాం

శాసనమండలిలో సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

శాసనమండలి: సంక్షేమ పథకాల సమాచారం ప్రజలకు తెలియజేసేందుకే యాడ్స్‌ ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా నవరత్నాల పథకాలు ఏపీలో అమలవుతున్నాయని సమాచార, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. పేపర్లకు యాడ్స్‌ ఇచ్చే విషయంలో ఎక్కడా వివక్షత లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటనలపై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.128 కోట్ల యాడ్స్‌ ఇచ్చిందన్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో యాడ్స్‌ కోసం రూ.449 కోట్లు ఖర్చు చేశారని, ఇష్టానుసారంగా ఎవరికి పడితే వారికి యాడ్స్‌ ఇచ్చేవారన్నారు. గత ప్రభుత్వంలో యాడ్స్‌ విషయంలో పారదర్శకత లేదు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకూ యాడ్స్‌ ఇచ్చారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పత్రికలకు పెద్ద పీట వేశారన్నారు. ఈనాడు పత్రికకు 50 శాతం రేటు పెంచి రూ.120 కోట్ల యాడ్స్‌ ఇచ్చారు. సర్క్యులేషన్‌లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి నిబంధనలను తుంగలోకి తొక్కి రూ.72 కోట్ల యాడ్స్‌ ఇచ్చారు. సర్క్యులేషన్‌లో రెండోస్థానంలో ఉన్న సాక్షి పత్రికకు మాత్రం కేవలం రూ.30 కోట్ల యాడ్స్‌ మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. 

యాడ్స్‌ విషయంలో గత తెలుగుదేశం ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంభించిందన్నారు. గత ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ ద్వారా యాడ్స్‌ ఇచ్చేవారని,  ఆ యాడ్స్‌ ద్వారా ఏజెన్సీకి 15 శాతం కమీషన్‌ ఇచ్చేవారన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం నేరుగా మీడియా సంస్థలకే యాడ్స్‌ ఇవ్వడం వల్ల రూ.80 కోట్లు ఆదా చేయగలిగామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top