జాతిని నమ్ముకుంటాను తప్ప.. అమ్ముకోను

బాబులా చీకట్లో చిదంబరం, మోడీ కాళ్లు పట్టుకోలేదు

పవన్ కల్యాణ్ వెళ్లి మాయావతి కాళ్లు  పట్టుకోలేదా..?

చిట్టబ్బాయ్‌ కుటుంబానికి అండ‌గా నిలిచిన వారికి కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డం నేర‌మా..? 

వక్రీకరణే ఎజెండాగా వికృత రాతలు రాస్తున్న ఎల్లో మీడియాను నమ్మొద్దు

శెట్టి బలిజలను, బలహీనవర్గాలను దగా చేసిన పార్టీ తెలుగుదేశం

శెట్టిబలిజలను హేళన చేసిన మీరా నీతులు చెప్పేది..?

చంద్ర‌బాబు, ఎల్లోమీడియాపై మంత్రి వేణుగోపాల‌కృష్ణ ధ్వ‌జం

తాడేపల్లి: ‘‘నేనేమి చంద్రబాబులా చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకోలేదు. కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి అండగా నిలిచినందుకే వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నేత, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి కాళ్లకు నమస్కరించా’’ అని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. శెట్టిబలిజ సామాజికవర్గాన్ని అవమానించానని ఈనాడు, ఏబీఎన్, టీవీ5 తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి వేణుగోపాల‌కృష్ణ ఏం మాట్లాడారంటే..

``గడిచిన వారం రోజులుగా రాష్ట్రంలో ఎల్లో మీడియాకు చెందిన రెండు పత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌, టీవీ5, ఈటీవీలు.. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందినవారిపై తమకు అమితమైన ప్రేమ ఏదో ఉన్నట్టు, జరగనిది జరిగినట్లుగా తమదైన వక్ర భాష్యాలతో విషప్రచారం చేస్తున్నారు.  శెట్టిబలిజ సామాజిక వర్గాన్ని నేనేదో తాకట్టు పెట్టినట్లుగా ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తూ, టీడీపీ, జనసేనలకు చెందిన కొంతమంది నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన, నిజాయితీకి మారుపేరుగా నిలిచిన కుడిపూడి చిట్టబ్బాయ్‌ వర్థంతి సభకు వెళ్లి.. ఆ కుటుంబానికి ఎంతో సాయం చేసిన, శెట్టి బలిజలను గుండెల్లో పెట్టుకుని చూస్తున్న ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతపూర్వకంగా,  ఆయన ప్రతినిధిగా ఆ సభకు వచ్చిన పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి మోకాళ్ల‌పై వంగి నమస్కారం చేస్తే.. దానికి వక్రభాష్యాలు చెబుతూ చిలువలు  పలువలుగా మాట్లాడుతున్నారు. ఆ నమస్కారాన్ని నేను సంస్కారంగానే భావించానే తప్ప, ఎవరినీ అవమానించడానికి కానేకాదు. 

లేనిది ఉన్నట్టు చూపుతూ, వక్రభాష్యాలు చెబుతూ.. ఎల్లో మీడియా చేసిన దుష్ప్రచారాల వల్ల, అది మా జాతీయులకు ఎవరికైనా బాధకలిగించినట్లు అయితే.. దానికి నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. మనకు సాయం చేసినవారికి కృతజ్ఞతగా ఉండాలనే భావనే తప్ప, అందులో ఎటువంటి దురుద్దేశాలు లేవు. కృతజ్ఞత తెలియచేయడమే నేరం అన్నట్టుగా మా సామాజికవర్గానికి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన కొంతమంది నేతలు మాట్లాడటం చూస్తుంటే విచిత్రంగానూ, వింతగానూ ఉంది. మా సామాజికవర్గంలో చిచ్చు పెట్టి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్నదే టీడీపీ, జనసేన పార్టీల ఉద్దేశం. 

నేనేదో జాతిని తాకట్టు పెట్టినట్టుగా ఎల్లో మీడియా విష ప్రచారం చేయ‌డం దారుణం. ఇందుకు సంబంధించి మాట్లాడిన వీడియోను మీడియాకు విడుదల చేశాను. నాపై విమర్శలు చేస్తున్న జనసేన నాయకులను ప్రశ్నిస్తున్నా. మరి, మీ జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వెళ్లి మాయావతి కాళ్లు  పట్టుకున్నారు. అలానే చంద్రబాబు మాదిరిగా చీకట్లో చిదంబరం, నేరుగా మోడీ కాళ్లు పట్టుకోలేదు. చీకటి రాజకీయాలు మాకు తెలియవు. ఇదే శెట్టి బలిజ వర్గీయులు.. 2014లో మాకు రెండు సీట్లు ఇవ్వండి అని చంద్రబాబును అడిగితే.. "సీట్లు ఇస్తే మీరు గెలుస్తారా.. మీకు ఆ సామర్థ్యం ఉందా" అని హేళన చేశారు.

శెట్టిబలిజ వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు అనే నాపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మనసులో ప్రత్యేకమైన స్థానం ఉండబట్టే.. కొత్త మంత్రివర్గంలో బీసీ సంక్షేమంతోపాటు సమాచార, సినిమాటోగ్రఫీ శాఖలు కేటాయించారు. శెట్టి బలిజలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఇస్తున్న ప్రాధాన్యం, పదవులు చూసి, ఆ  సామాజిక వర్గం అంతా వైయ‌స్ఆర్ సీపీకి చేరువ అవ్వడంతో ఓర్చుకోలేక టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన వారు ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు. జాతిని అమ్ముకోవాల్సిన ఖర్మ నాకు పట్టలేదు. జాతిని నమ్ముకుంటాను తప్ప అమ్ముకోను. మా జాతి నాయకులకు మేలు జరుగుతుందంటే.. వారి కోసం ఎంతవరకైనా పోరాడతా.  శెట్టి బలిజ సామాజిక వర్గం ఉన్నతికి కృషి చేస్తున్న నాయకుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

శెట్టి బలిజ సామాజిక వర్గం పడుతున్న కష్టాలను శాసనసభలలో వివరించాను. బీసీల్లోని 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. బీసీ సంక్షేమ శాఖ ద్వారా, రాష్ట్ర  బడ్జెట్ లో అధిక శాతం రూ. 32 వేల కోట్ల నిధులు కేటాయించి ఈ వర్గాలను ఆదుకుంటున్న నాయకుడు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్. కల్లు గీత కార్మికులుగా ఉన్న మేము ఈరోజు ఉన్నతమైన పదవుల్లో ఉన్నాం.. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడితే.. అందులో రెండు స్థానాలను బీసీలకు కేటాయించి, మా జాతికి దేశవ్యాప్తంగా గౌరవం, గుర్తింపు కల్పించిన నాయకుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌. రెండు రాజ్యసభ స్థానాల్లో.. ఒకటి మా శెట్టిబలిజ వర్గానికే చెందిన పిల్లి సుభాష్ చంద్రబోసుకి, రెండోది మత్స్యకార వర్గానికి చెందిన మోపిదేవి వెంకట రమణకి ఇచ్చి వారిని రాజ్యసభకు పంపించిన ఘనత సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కే దక్కుతుంది. బీసీలకు 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్ గారు. బీసీలకు ఏనాడూ మంచి చేయని చంద్రబాబు, టీడీపీ నాయకులు మాపై విమర్శలు చేయడం విడ్డూరం`` అని మంత్రి వేణుగోపాల‌కృష్ణ అన్నారు.

Back to Top