బీజేపీ నేతలు చంద్రబాబు లైన్‌లో నడుస్తున్నారు

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

సోము వీర్రాజు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి
 

చంద్రబాబు 40 దేవాలయాలు కూల్చేశారు

ఏపీలో కుల, మతాలకు అతీతంగా పాలన సాగుతోంది

సోము వీర్రాజు  దేశభక్తుడా? తెలుగు దేశం పార్టీ భక్తుడా?

మతతత్వ పార్టీల పప్పులు ఇక్కడ ఉడకవ్‌  

తాడేపల్లి:  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో బీజేపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు లైన్‌లో నడుస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కల్పిస్తుందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించేందుకు సోము వీ్రరాజు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌పై, ప్రభుత్వంపైసోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను మంత్రి తీవ్రంగా ఖండించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌పై ఇందాక సోము వీర్రాజు  పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని, ముఖ్యమంత్రి దేశద్రోహి అంటూ కామెంట్లు చేశారు. అసలు సోము వీ్రరాజు ఎక్కడ ఉండి పరిపాలన చేస్తున్నారో అర్థం కావడం లేదు. దేశంపై, రాష్ట్రంపై సారా   వీర్రాజు
కు ఏమాత్రం ప్రేమ లేదు. రాష్ట్రంలో కులాలకు, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పరిపాలన సాగుతుంది. ముఖ్యమంత్రిని నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? వీ్రరాజు నీ..స్థాయి ఏంటి? సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? జాగ్రత్తా..మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. కార్పొరేటర్‌గా కూడా గెలవలేని వ్యక్తి బీజేపీకి అధ్యక్షుడని ఎద్దేవా చేశారు.

గత ప్రభుత్వంలో మీ పార్టీకి చెందిన వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. టీడీపీ ప్రభుత్వం 40 దేవాలయాలు కూల్చితే మీకు బాధ్యత లేదా?. దేవాలయాలను కూల్చిన చరిత్ర మీది. వాటిని కట్టించిన, కట్టిస్తున్న చరిత్ర వైయస్‌ జగన్‌ది. అటువంటి ముఖ్యమంత్రిపై మతం ముద్ర వేస్తారా? మాది మతతత్వ పార్టీనా అని నిలదీశారు. ఇప్పటి వరకు వైయస్‌ జగన్‌ ఒక్కటే చెబుతున్నారు. అర్హత ఉంటే చాలు కులం, మతం చూడకుండా పథకాలు అందించాలని చెబుతున్నారు.  

 

సోము వీర్రాజు  ఒరిజినల్‌ బీజేపీనా? డుప్లీకెట్‌ బీజేపీనా?, దేశభక్తుడా లేక తెలుగు దేశం పార్టీ భక్తుడా? ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు పేల్చుతున్నారు. 
మీ పార్టీ ఇన్‌చార్జ్‌ను ఎక్కడో నార్త్‌ ఇండియా నుంచి తరిమేశారు. అలాంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మతాల గురించి, పార్టీల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు వలస పక్షులు సీఎం రమేష్, సుజనా చౌదరికి వీళ్లంతా కూడా చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నారు. మీకు సిగ్గుశరం ఉంటే మీ హయాంలో దేవాలయాలు కూల్చినప్పుడు ఏమయ్యారు. మీరు కూల్చిన గుళ్లూ, గోసాలలు ఈ రోజు మా సీఎం నిర్మిస్తున్నారు. మీకు హిందువులపై కపట ప్రేమ ఉంది. హిందువులకు ఒక్క మేలు కూడా ఏపీలో చేయలేదు. రామతీర్థం, అంతర్వేది ఘటన జరిగితే మీ కోరిక మేరకు సీబీఐ విచారణకు మూడో రోజే మా ప్రభుత్వం కోరింది. ఇంతవరకు అతీగతి లేదు. ధ్వంసం చేసిన రాముడి విగ్రహాన్ని రేపు శ్రీరామ నవమికి ప్రతిష్ట చేస్తున్నామన్నారు.
శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడి మనుషులు గుడిలోని విగ్రహాలను తీసుకెళ్తే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు.

ఈ ప్రభుత్వం గతంలో ఎన్నడూ చేయని విధంగా హిందువులకు మేలు చేస్తుందని గర్వంగా చెబుతున్నాను. దేవాలయాలన్నీటిని అభివృద్ధి చేస్తున్నాం. ఓట్ల కోసం మత రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేసే సోము వీ్రరాజు, సీఎం రమేష్, సుజనా చౌదరిలు ఏపీకి ఛీడ పురుగుల్లాంటి వారు. సోము వీ్రరాజు ఏ రోజైనా కేంద్రం వద్దకు వెళ్లి పోలవరం, విశాఖ ఉక్కు, రైల్వే జోన్‌ గురించి ఒక్క మాటైనా మాట్లాడారా? మతతత్వపార్టీ ఎవరిదని అడిగితే అది సోము వీ్రరాజు పార్టీనే అని చెబుతారు. భోగి మంటలు ఎందుకు వేస్తారో మీకు తెలియదా? ప్రభుత్వ జీవోలను తగులబెడుతారా? మా సీఎం సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. అన్ని కులాలను, మతాలను కలుపుపోయే ప్రభుత్వం మాది. అందరికీ మంచి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని, సీఎంపై అవాకులు, చవాకులు పేల్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రూ.50లకే క్వార్టర్‌ మద్యం ఇస్తామన్న వ్యక్తి బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నారు. క్యాసినో ఉండేది గోవాలో..అక్కడ ఎందుకు రద్దు చేయలేదు. రాష్ట్రానికో మాట, పూటకో మాట, ప్రాంతానికో మాట మాట్లాడేవారు ఇవాళ బీజేపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండటం దురదృష్టకరం. ఇలాంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదని సోము వీ్రరాజును మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హెచ్చరించారు. ఏపీలో మతతత్వాలకు పప్పులు ఉడకవని ఆయన పేర్కొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top