ఆలయాలపై దాడి చేసిన దుర్మార్గుడు చంద్రబాబు

రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం ఉంది

దోషుల‌ను గుర్తించి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం

దేవుడు అంటే బాబుకు భయం, భక్తి ఉందా..?

బూట్లు వేసుకొని పూజలు చేసే నీచుడు, రాక్ష‌సుడు అత‌నే.. 

సీఎం వైయస్‌ జగన్‌కు సవాల్‌ చేసే స్థాయి చంద్రబాబుకు లేదు

రామ‌తీర్థంలో ప్ర‌మాణం ఎందుకు చేయ‌లేదు..?

తండ్రీకొడుకులు సైన్యంతో వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ బొటనవేలు కూడా తాకలేరు

జైశ్రీరాం అని నాటకాలు ఆడినా బాబును బీజేపీ రక్షించదు

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు జైలుకెళ్లడం ఖాయం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

తాడేపల్లి: హిందూ దేవాలయాలపై దాడి చేసిన దుర్మార్గుడు, గోశాలను కూల్చివేసి గోవులకు నిలువ నీడ లేకుండా చేసిన నీచుడు చంద్రబాబు అని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. చంద్రబాబుకు దేవుడు అంటే భక్తి, భయం ఉందా..? బూట్లు వేసుకొని దేవుడి పూజలు చేస్తావా..? బూట్లు వేసుకొని పూజలు చేసే వ్యక్తి హిందువా..? హిందుత్వం తెలుసా.. ? చంద్రబాబు కంటే దుర్మార్గుడు, రాక్షసుడు ఎవరైనా ఉంటారా..? అని ధ్వజమెత్తారు. ఆలయాలను కూల్చే చరిత్ర, విగ్రహాలపై దాడులు చేసే చరిత్ర చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు ప్రెస్‌మీట్‌ చూసిన‌ తరువాత రామతీర్థంలో ఘటన వెనుక అతని పూర్తి హస్తం ఉందనే అనుమానం కలుగుతుందన్నారు. తానే కుట్ర చేసి ప్రభుత్వంపై బురదజల్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మండిపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అయ్యప్పస్వామి మాల వేసుకుంటే లిక్కర్‌ ఆదాయం తగ్గిపోతుందని చెప్పిన నీచుడు చంద్రబాబు. ఎవరైనా పాపాలు చేస్తేనే గుడిలోకి వెళ్తారని మాట్లాడిన చంద్రబాబు.. ఈ రోజు రామతీర్థం ఎందుకు వెళ్లాడు. 

సీఎం వైయస్‌ జగన్‌ 18 నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుందని, వైయస్‌ జగన్‌కు వస్తున్న మంచిపేరును చూసి తట్టుకోలేక మొన్నటి వరకు కులాల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టాడు. ఇప్పుడు మతాల మధ్య చిచ్చుపెట్టడానికి, విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుట్రలు చేస్తున్నాడు. 

ఎన్టీఆర్‌ సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయాల్లోకి వచ్చాక నటించలేదు. కానీ, చంద్రబాబు రాజకీయాల్లోనే నటించే దుర్మార్గుడు. చంద్రబాబు చేసిన దుర్మార్గాలకు గతంలో ధర్నాలు, దీక్షలు చేశాం. మాపై తప్పుడు కేసులు పెట్టినా భయపడకుండా చాలా ఆలయాలను కాపాడుకున్నాం. 

చంద్రబాబు రామతీర్థం వెళ్లి మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అలిపిరి బాంబ్‌ బ్లాస్ట్‌ నుంచి వెంకటేశ్వరస్వామి కాపాడాడా..? నీకు నువ్వే బాంబులు పెట్టి సింపథితో ఎన్నికలకు వెళ్దామనుకుంటే.. ఆ వెంకటేశ్వరస్వామి నిన్ను ఓడించాడని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో జీరో అయిపోయాడు. 

2015 నుంచి ఆలయాలపై దాడులు, చోరీలు జరిగిన కేసులు ఒకసారి చూస్తే.. 2015లో 290 కేసులు, 2016లో 322 కేసులు, 2017లో 318 కేసులు, 2018లో 267 కేసులు, 2019లో 305 కేసులు, 2020లో 340 కేసులు ఉన్నాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఇన్ని కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది.. నీ తప్పిదం కాదా..? 

ప్రశాంతంగా పాలన జరుగుతున్న రాష్ట్రంలో మతాల మధ్య చిచ్చుపెట్టాలని కుట్ర చేస్తున్నాడు చంద్రబాబు. సిగ్గులేదా.. నీ కొడుకు ట్విట్టర్‌లో ప్రమాణం చేయమంటాడు.. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనలో నీ ప్రమేయం లేదని రామతీర్థంలోనే ప్రమాణం చేసి ఉంటే ప్రజలు నమ్మేవారు కదా చంద్రబాబూ.. ఒకపక్క ధ్వంసాలు.. మరోపక్క మొసలికన్నీరు కారుస్తున్నావ్‌. నువ్వు మనిషివేనా..? రామతీర్థంలో కూడా అమరావతి గురించి మాట్లాడుతున్నాడు. 

రామతీర్థం చైర్మన్‌గా ఇప్పటి వరకు కొనసాగించి అశోక్‌ గజపతిరాజు కాదా..? ఘటన జరిగిన తరువాత అశోక్‌ గజపతి రాజు ఎందుకు స్పందించలేదు. గత నెల 30వ తేదీన సీఎం వైయస్‌ జగన్‌ విజయనగరం పర్యటనకు వెళ్తున్నారని, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్‌ చేయడానికి 28వ తేదీనే ఈ ఘటన చేయించాడు. చంద్రబాబు మాటలు వింటే.. ఈ ఘటన వెనుక చంద్రబాబు హస్తం పూర్తిగా ఉందన్నట్లుగా అనిపించింది. 

నువ్వెంత.. నీ బతుకెంత చంద్రబాబూ.. సీఎం వైయస్‌ జగన్‌కు వార్నింగ్‌ ఇస్తావా.. ఖబడ్దార్‌ ఏంటీ..? నువ్వు, నీ కొడుకు, నీ సైన్యం అంతా వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ కాలి బొటనవేలు కూడా ముట్టుకోలేరు. ప్రజల గుండెల్లో దేవుడిగా ఉన్న వ్యక్తి వైయస్‌ జగన్‌. అలాంటి నాయకుడిని పట్టుకొని ఖబడ్దార్‌ అంటూ మాట్లాడుతావా..? చంద్రబాబు చౌదరి నీకు ఎవరూ భయపడేవారు లేరు. హిందూ దేవాలయాలను కాపాడే బాధ్యత మాది. 

పప్పునాయుడు సవాల్‌ను స్వీకరించిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రమాణానికి సిద్ధం అన్నారు. పప్పునాయుడుకు ఎంపీ విజయసాయిరెడ్డి సరిపోరా..? కార్పొరేటర్‌గా కూడా గెలవలేని పప్పునాయుడు.. సీఎం వైయస్‌ జగన్‌ గారితో ఢీ కొడతాడా..? దొడ్డిదారిన ఎమ్మెల్సీ, మంత్రి అయ్యి రాష్ట్రాన్ని దోచుకునన దుర్మార్గుడు లోకేష్‌. 

మతాల మధ్య చిచ్చుపెడితే ఊరుకునే పరిస్థితి లేదు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతాడు. అసెంబ్లీలోకి కూడా రాలేడు. ఓటుకు నోటు కేసు విషయంలో రానున్న కొద్ది రోజుల్లోనే చంద్రబాబును అరెస్టు చేయడం ఖాయం. జైశ్రీరాం అంటే ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా..?’ అని చంద్రబాబుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. 
 

Back to Top