రాజధాని గురించి చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ 

విజయవాడ: ఐదేళ్లలో రాజధానిని ఏం అభివృద్ధి చేశావని రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెట్టావని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చంద్రబాబును ప్రశ్నించారు. విజయవాడలో మంత్రి వెల్లంపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఐదేళ్లలో చంద్రబాబు సాధించలేనిది.. ఐదు నెలల్లో సీఎం వైయస్‌ జగన్‌ సాధించాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు ఒక విజన్‌ ఉందని, ఆ విజన్‌ ప్రకారం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఒక్క రూపాయి అప్పు పుట్టే పరిస్థితి లేకుండా చేశాడు. రాజధానిని వేల కోట్లతో అభివృద్ధి చేయాలని బాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబులా జనాన్ని మోసం చేయడం సీఎం వైయస్‌ జగన్‌కు రాదన్నారు. రియాల్టీ ప్రకారం సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని నేరుగా ఎదుర్కోలేక, సంక్షేమ పథకాల్లో ప్రశ్నించే అవకాశం లేకపోవడంతో చంద్రబాబు, ఆయన పాట్నర్‌ పవన్‌ మతం, కులం, ఇసుక, రాజధాని అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బాబు డైరెక్షన్‌లో పవన్‌ యాక్షన్‌ చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఎన్ని రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు పెట్టినా.. ఇబ్బంది ఏమీ లేదని, విజన్‌ ప్రకారం రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకెళ్తామన్నారు. 

Read Also: కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌

తాజా ఫోటోలు

Back to Top