కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకల్లో సీఎం వైయస్‌ జగన్‌

 అనంతపురం: పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా   పెనుకొండ మండలం ఎర్రమంచిలోని కియా కంపెనీని సీఎం సందర్శించారు. కంపెనీలో వివిధ విభాగాలను సీఎం పరిశీలించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీకి కియాను దక్షిణ కొరియా సంస్థ ఏర్పాటు చేసింది.  రూ.13,500 కోట్లతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు. కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.  పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం సమీక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు శంకర్‌నారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యేలు.

Read Also: చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం 

తాజా ఫోటోలు

Back to Top