కోర్టు విధులు బ‌హిష్క‌రించిన క‌ర్నూలు న్యాయ‌వాదులు

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ అడ్వకేట్ గురురాజాపై జరిగిన దాడిని ఖండిస్తూ   కర్నూలు న్యాయవాదులు 
కోర్టు విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. జూన్ 8 వతేదిన కొంతమంది టిడిపి నాయకులు న్యాయవాది గురవరాజు రావుపై దాడికి పాల్పడ్డారు. టిడిపి నాయకులు నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారని అక్కసుతో న్యాయవాది గురురాజు రావు పై  టిడిపి నేతలు దాడికి పాల్ప‌డ్డారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి , న్యాయవాదులకు రక్షణ  కల్పించాలని న్యాయ‌వాదులు డిమాండ్ చేశారు.
గురురాజా రావుకు న్యాయం జరగక పోతే పెద్దఎత్తున పోరాటం చేస్తామని  న్యాయవాదులు హెచ్చ‌రించారు.

Back to Top