విమాన ప్రమాదం పట్ల వైయ‌స్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

తాడేపల్లి: ఎయిరిండియా ఘోర విమాన ప్రమాదంపై వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తీవ్ర  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ  సానుభూతి తెలియజేసిన ఆయన.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. 

గురువారం మధ్యాహ్న సమయంలో అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానం(Air India AI-171 flight).. టేకాఫ్‌ అయిన కాసేపటికే సమీపంలోని కుప్పకూలి పేలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం ప్రయాణికులు, పైలట్లు, సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నారు. వీటికి తోడు విమానం జనావాసాలపై కూలడంతో మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది.

Back to Top