వైయస్ జగన్ పర్యటనలో ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర

కిరాయి మనుషులతో టీడీపీ నేతలు రాళ్ళు రువ్వించారు

ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతల ఆగ్రహం

 వైయస్ఆర్‌సీపీ ప్రకాశంజిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నేతలు 

జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న నేత కాన్వాయికి సమీపంగా అరాచక శక్తులు ఎలా వచ్చాయి?

వైయస్ జగన్‌ను జనంలో తిరగనివ్వకూడదనే కూటమి ప్రభుత్వ లక్ష్యం

ఎంతగా కవ్వించినా ధైర్యంగా రైతుల పక్షనా నిలబడ్డ వైయస్ జగన్ 

సంయమనంతో వ్యవహరించిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులు

పొగాకు రైతుల కోసం వచ్చిన వైయస్ జగన్‌ను అడ్డుకోవడం సిగ్గుచేటు

ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ నేతలు 

ఒంగోలు: మాజీ సీఎం వైయస్ జగన్‌ పొదిలి పర్యటనలో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా హింసకు కుట్ర పన్నిందని దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో పార్టీ ముఖ్యనాయకులతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. టీడీపీ నేతలు కిరాయి మనుషులతో రాక్షసంగా వైయస్ జగన్ కాన్వాయిపై రాళ్ళు రువ్వి, ఉద్రిక్త పరిస్థితిని సృష్టించాలని ప్లాన్ చేశారని వారు మండిపడ్డారు. జెడ్‌ప్లస్ కేటగిరి ఉన్న నాయకుడి పర్యటన సందర్భంగా కాన్వాయికి అతి సమీపంలోకి  అరాచకశక్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. వైయస్ జగన్‌ను ప్రజల్లోకి తిరగనివ్వకూడదనే ఏకైక ఎజెండాతో కూటమి ప్రభుత్వం ఎటువంటి అరాచకానికైనా తెగబడుతోందని అన్నారు. ఎంతగా కవ్వించినా వైయస్ జగన్, పార్టీ శ్రేణులు ధైర్యంగా రైతుల పక్షాన నిలబడ్డారని, పొగాకు కొనుగోళ్ళపై సర్కార్ అలసత్వాన్ని నిలదీశారని అన్నారు. ఇంకా వారు ఎమన్నారంటే....

 పొగాకు రైతుకు భరోసా కల్పించారు: ఒంగోలు జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

మాజీ సీఎం వైయస్ జగన్ పొదిలి వేలం కేంద్రంలో పొగాకు రైతులను పరామర్శించారు. పొగాకు కొనుగోళ్ళ విషయంలో ప్రభుత్వంను నిలదీశారు. రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ నిలుస్తుందనే భరోసా కల్పించారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మే నాయకుడు వైయస్ జగన్. అందుకే ఆయన సీఎం అయిన తరువాత రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటుధర లేక అల్లాడుతుంటే ప్రభుత్వం తరుఫున మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయించారు. పొగాకు రైతులకు అండగా ఉంటేందుకు పొదిలి వేలం కేంద్రంకు వస్తుంటే, టీడీపీ మహిళలను అడ్డం పెట్టకుని ఆయన పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. చెప్పులు, రాళ్ళు విసిరి అరాచకం సృష్టించేందుకు తెగబడ్డారు. రైతుల కోసం వచ్చిన ప్రతిపక్ష నాయకుడిని అడ్డుకోవడం విడ్డూరంగా ఉంది. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్ళించాలనే డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ రకంగా టీడీపీ కుట్రకు పాల్పడింది. ఈ రాష్ట్ర చరిత్రలో వైయస్ఆర్ తరువాత మహిళలకు అగ్రస్థానంలో నిలబెట్టిన నాయకుడు వైయస్ జగన్. రాష్ట్రంలో ఆయన పాలనలో మహిళలకే అధికశాతం పథకాలను అమలు చేశారు. ఈ రోజు తన ర్యాలీలో కూడా మహిళలను అడ్డం పెట్టుకుని టీడీపీ రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నా, ఆ మహిళలకు నమస్కారం చెస్తూ వెళ్ళిపోయారే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైయస్ జగన్ వస్తున్నారనే విషయం, ఆయన పర్యటన గురించి ముందుగానే తెలిసి, ఆయన కార్యక్రమాన్ని ఏదో ఒక విధంగా విఫలం చేయాలనే దుష్టతలంపుతోనే టీడీపీ ఈ రకంగా మహిళల ముసుగులో దిగజారుడు రాజకీయం చేసింది. పోటీ కార్యక్రమాన్ని నిర్వహించి, రాళ్ళు రువ్వడం ద్వారా భయాందోళనలకు గురి చేసిందని  ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు. . 

మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే నేతృత్వంలో కుట్ర:   మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు  

పొగాకు కొనుగోళ్ళ విషయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో రైతులను ఆదుకోవాలనే లక్ష్యంలో మాజీ సీఎం, వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పొగాకు వేలం కేంద్రానికి వచ్చి రైతులతో మాట్లాడారు. పొగాకు రైతులకు గిట్టుబాటు రేటు కల్పించాలని, ప్రభుత్వ పరంగా కొనుగోళ్ళు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే వైయస్ జగన్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మహిళల నిరసనల పేరుతో రాళ్ళు రువ్వతూ గందరగోళ పరిస్థితులను సృష్టించింది. ఈ రాళ్ళ దాడిలో పలువురు వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. టీడీపీ ఏదైనా నిరసనలు చేయాలంటే ప్రజాస్వామిక విధానాల్లో, శాంతియుత పద్దతుల్లో నిర్వహించాలే తప్ప ఈ రకంగా రైతుల గురించి మాట్లాడేందుకు వచ్చిన ప్రతిపక్ష నేత పర్యటనపై రాళ్ళ దాడి చేయడం దారుణం. మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలోనే కార్యకర్తలను రెచ్చగొట్టి, ఇటువంటి అరాచకానికి  ప్రోత్సహించారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో ఆయన పొదిలిలో ఎందుకు తిరిగాడో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. 

టీడీపీ నేతలు సిగ్గుపడాలి:   చుండూరి రవి, ఒంగోలు నియోకవర్గ ఇన్‌చార్జి

కిరాయి మనుషులతో తెలుగుదేశం నాయకులు వైయస్ జగన్ పర్యటనపై రాళ్ళు రువ్వించారు. ఒక మంచి సమస్యపై లక్షలాది మంది రైతులకు మేలు చేయాలని వైయస్ జగన్ జిల్లాకు వస్తే, దానిని భగ్నం చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలి. వ్యాపారులతో ప్రభుత్వం కుమ్ముక్కు అవ్వడం వల్లే పొగాకు కు గిట్టుబాటు రేటు రావడం లేదు. ఇటువంటి దుష్ట సంస్కృతిని ప్రోత్సహిస్తే సమాజంలో అరాచకం మరింత పెరుగుతుందని చుండూరి  రవి అన్నారు.

Back to Top