‘తన్మయి కేసు.. సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?’ 

 వైయ‌స్ఆర్‌సీపీ, ఎమ్మెల్సీ  కుంభా రవిబాబు 

అనంతపురం: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా అని వైయ‌స్ఆర్‌సీపీ, ఎమ్మెల్సీ  కుంభా రవిబాబు విమ‌ర్శించారు. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?.. మహిళలు, చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పట్టించుకోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ కుంభా రవిబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘గిరిజన ఇంటర్ విద్యార్థి తన్మయిది ప్రభుత్వ హత్యే. ఈనెల మూడో తేదీన ఫిర్యాదు అందితే.. ఎందుకు గాలింపు చర్యలు చేపట్టలేదు?. తప్పును కప్పిపుచ్చుకునేందుకు సీఐను సస్పెండ్ చేస్తే సరిపోతుందా?. నలుగురు అనుమానితులు ఉంటే.. ఒకరిపైనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి గిరిజనులు అంటే చులకనా?. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు పెరిగాయి. అసలు రాష్ట్రంలో హోంమంత్రి ఉన్నారా?. మహిళలపై అఘాయిత్యాలు పట్టించుకోరా? అని ప్రశ్నించారు.

మరోవైపు.. వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..‘చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇంటర్ విద్యార్థి తన్మయి దారుణ హత్య జరిగింది. గిరిజన బాలిక తన్మయి మృతదేహానికి రీ-పోస్టుమార్టం నిర్వహించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. బాధిత కుటుంబానికి పరిహారం, భూమి, ఇంటి స్థలం ఇవ్వాలి’ అని డిమాండ్‌ చేశారు.

 

 

Back to Top