విజయవాడ: దేవాదాయ శాఖలో వినూత్న మార్పులు తీసుకువచ్చామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. దేవాలయాల భూములు కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. హైకోర్టు ట్రిబ్యూనల్‌లో కేసు పరిష్కారానికి న్యాయవాదులను నియమిస్తున్నామన్నారు. దేవాలయాల అభివృద్ధికి కూడా నాడు–నేడు విధానం రూపొందించామని, ప్రతి ఆలయంలో గోశాల ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు కూల్చేసిన ఆలయాలను వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మిస్తోందని చెప్పారు. త్వరలోనే 9 దేవాలయాలను ప్రారంభిస్తామన్నారు. ప్రసాదం స్కీమ్ ద్వారా ప్రముఖ దేవాలయాల అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు.