సంక్షేమ పథ‌కాలతో ప్రజల జీవితాల్లో వెలుగు

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

అనంత‌పురం: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు నిరుపేద‌ల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయ‌ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గం, శెట్టూరు మండ‌లం, రంగ‌య్య‌పాలెం గ్రామంలో `గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం` కార్య‌క్ర‌మంలో మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటికీ తిరిగి వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వ సంక్షేమ పాల‌న గురించి వివ‌రించారు. మూడేళ్ల పాల‌న‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేసిన సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని వివ‌రించారు. ప్ర‌జ‌ల నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు చేస్తున్న మంచిని వివ‌రిస్తూ..  సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అధికారులు, గ్రామ వ‌లంటీర్లు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top