బీసీల సంక్షేమమే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం 

మంత్రి ఉషాశ్రీచరణ్ 
 

అనంత‌పురం:   బీసీల సంక్షేమ‌మే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు. సోమ‌వారం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని వివేకానంద ఎంబీఏ కళాశాల ఆవరణలో గుంతకల్లు నియోజకవర్గం శాసన సభ్యులు వై.వెంకటరామిరెడ్డి  అధ్యక్షతన నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు నియోజకవర్గ స్ధాయి ప్లీనరీ సమావేశంలో ఆమె పాల్గొని ప్ర‌సంగించారు.  బిసిల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్నారు. విద్యాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. బీసీల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ ధ్యేయం. వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి అన్ని రకాలుగా అండగా నిలవడానికి కొత్త కార్పొరేషన్లను ఏర్పాటు చేసింద‌ని చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top