రైతు సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం 

పంటల భీమా రాని రైతుల కోసం మూడు రోజుల ప్రత్యేక గ్రివెన్స్ ఏర్పాటు

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌

అనంత‌పురం:  రైతు సంక్షేమ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ పేర్కొన్నారు. సోమ‌వారం యాటకల్లులో రైతులకు ప్రభుత్వం రాయితీపై అందిస్తున్న సూక్ష్మ నీటి పరికరాలును మంత్రి ఉషాశ్రీచరణ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమమే లక్ష్యంగా దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ముంగిటకే సంక్షేమ పధకాలు అందిస్తున్న ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహ‌న్ రెడ్డి అని కొనియాడారు.  రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకూడదనే ఉద్దేశంతో  పంటల బీమా రాని రైతుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు నేటి నుంచి గ్రామ సచివాలయాలలో మూడు రోజుల పాటు ప్రత్యేక గ్రివెన్స్ ఏర్పాటు చేశార‌ని, రైతులు ఈ అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top