రైతుల సంక్షేమమే జగనన్న లక్ష్యం 

మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్‌
 

అనంత‌పురం:  రాష్ట్రంలోని రైతుల సంక్షేమ‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ల‌క్ష్య‌మ‌ని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ అన్నారు.  బెస్తరపల్లిలో వైయ‌స్ఆర్‌  రైతు భరోసా - పి.యం.కిసాన్ కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొని మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..   వరుసగా నాలుగో ఏడాది రెండో విడతగా వై.య‌స్.ఆర్. రైతు భరోసా (పి.యం. కిసాన్) 2022- 2023 పథకాన్ని ఆళ్లగడ్డ నుంచి లాంఛనంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌మ చేశారు.   అనంతపురం జిల్లా వ్యాప్తంగా వై.యస్.ఆర్ రైతు భరోసా - పి.యం.కిసాన్ 2022-2023 పధకం క్రింద  2,83,063 మంది రైతులకు గానూ నూట 113.23 కోట్లు (పదమూడు కోట్ల ఇరవై మూడు లక్షలు రూపాయలు) వైయ‌స్ జ‌గ‌న్ జ‌మ చేశార‌ని మంత్రి తెలిపారు.  

Back to Top