టీడీపీ అక్రమాలపై విచారణ చేయిస్తాం

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత

అనంతపురం జిల్లా: స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో అవినీతి సహించేది లేదని, అవినీతి జరిగితే సంబంధిత ఐసీడీఎస్‌ పీడీలదే బాధ్యత అని సంబంధిత శాఖ మంత్రి తానేటి వనిత హెచ్చరించారు. అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పథకాలపై మంత్రి తానేటి వనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో పేదలకు అందాల్సిన నిధులు పక్కదారి పట్టాయని, అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. మహిళల సంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ సర్కారు ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అవినీతి రహిత పాలన అందిస్తున్నారన్నారు. అధికారులు నిబద్ధతో పనిచేయాలని సూచించారు. 

 

Read Also: నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తాం

Back to Top