చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేయించండి

ముఖ్యమంత్రిపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు

ఉద్యోగులను బెదిరించేలా చంద్రబాబు మాటలు

చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్క పైసా ఇవ్వలేదు

అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని బాబు ప్లాన్‌ చేశారు

ఇచ్చిన మాట ప్రకారం వైయస్‌ జగన్‌ బాధితులకు న్యాయం చేశారు

హోం మంత్రి మేకతోటి సుచరిత 

గుంటూరు:  చంద్రబాబు మానసిక పరిస్థితి సరిగా లేదని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, అధికారులను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించాలని ఆమె సూచించారు. శుక్రవారం సాయంత్రం గుంటూరులో సుచరిత మీడియాతో మాట్లాడారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు చెల్లించారని, వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో బాధితులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఆస్తులు కాజేసేందుకు కుట్రలు చేశారని విమర్శించారు.  2019 వరకు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు  అగ్రిగోల్డ్‌ బాధితులకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా అన్యాయం చేశారన్నారు. ఆ రోజు న్యాయం చేశామని, ఈ రోజు ప్రభుత్వం అన్యాయం చేస్తున్నట్లు టీడీపీ నేతలు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆ రోజు పాదయాత్రలో అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇచ్చిన మాట కోసం మొదటి కేబినెట్‌ సమావేశంలోనే రూ.1150 కోట్లు కేటాయిస్తూ తీర్మానం చేశార్ననారు. మొదటి విడతగా రూ.264 కోట్లు విడదల చేసి రూ.10 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చారన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. చంద్రబాబు డీజీపీని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడటం దారుణమన్నారు. మొన్నటి వరకు పల్నాడులో అరాచకాలు జరుగుతున్నాయని గగ్గొలు పెట్టారన్నారు. హ్యుమన్‌ రైట్స్‌ కమిషన్‌ వచ్చి పల్నాడు ప్రశాంతంగా ఉందని రిపోర్టు ఇచ్చిందన్నారు. ఖాకీ చొక్కాలు వేసుకున్న పోలీసులకే గత ప్రభుత్వం తోడ్పాటునందించిందని, ఈ రోజు అందరికీ మా ప్రభుత్వం సమాన గౌరవం ఇస్తుందన్నారు. చంద్రబాబు మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. ఈ రోజు స్వేచ్ఛగా   కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లే వారికి న్యాయం జరుగుతుందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పుచేసినా వదలవద్దని సీఎం చెప్పారన్నారు. ఆ రోజు చంద్రబాబు అధికారంలో ఉండి అధికారులను ఎలా బెదిరించారో ప్రజలకు తెలుసు అన్నారు. పల్నాడులో జరిగిన మైనింగ్‌ అక్రమార్కులకు చంద్రబాబు కొమ్ముకాశారన్నారు. మహిళా అధికారిణి వనజాక్షిని జుట్టుపట్టుకొని లాగారన్నారు. ఈ రోజు చంద్రబాబు మంత్రులను, అధికారులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ..నకరాలు చేస్తున్నారా అని బెదిరించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రిని ఇష్టారాజ్యంగా మతి భ్రమించి చంద్రబాబు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదని, ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని కుటుంబ సభ్యులను కోరారు. 

 

Read Also:  ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’కు జీతభత్యాలు విరాళంగా ప్రకటించిన ఆర్కే

Back to Top