‘కనెక్ట్‌ టు ఆంధ్రా’కు జీతభత్యాలు విరాళంగా ప్రకటించిన ఆర్కే

అమరావతి: రాష్ట్ర అభివృద్ధి కోసం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ఏపీ అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సాయం కొరకు ఏర్పాటు చేసిన కనెక్ట్‌ టు ఆంధ్రా అనే వెబ్‌ పోర్టల్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా ఎమ్మెల్యే ఆర్కే ఈ నవంబర్‌ నుంచి పదవి కాలం పూర్తయ్యేంత వరకు తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. తన జీతభత్యాలను ‘కనెక్ట్‌ టు ఆంధ్రా’కు అందజేయాల్సిందిగా అసెంబ్లీ కార్యదర్శికి లిఖితపూర్వకంగా లేఖ అందజేశారు.

 

Read Also: కనెక్ట్‌ టూ ఆంధ్రా వెబ్‌ పోర్టల్‌ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

తాజా వీడియోలు

Back to Top