ఓటీఎస్‌ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి

మంత్రి శ్రీరంగనాథరాజు
 

 పశ్చిమగోదావరి: ఓటీఎస్‌ ద్వారా 52 లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. 4 లక్షల కోట్ల ఆస్తిని పేదలకు సీఎం జగన్‌ అందిస్తున్నారన్నారు. ఓటీఎస్‌పై కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 4 వేల కోట్లు లబ్ధిదారులు చెల్లించడం ద్వారా పేదలకు 10 వేల కోట్ల రుణ మాఫీ జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో రుణ భారంలో ఉన్న పేద వారికి రుణ విముక్తి కలిగించి ఓటీఎస్‌తో వారి ఇంటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. 52 లక్షల మందికి సంపూర్ణ గృహ హక్కు కల్పిస్తున్నారన్నారు. రుణం లేనివారి దగ్గర 10 రూపాయల నామమాత్రపు రుసుంతో రిజిస్ట్రేషన్ పట్టా అందిస్తున్నామని’’ శ్రీరంగనాథరాజు అన్నారు.

Back to Top