వైయ‌స్ఆర్‌సీపీలోకి మంత్రి  సోమిరెడ్డి సోద‌రుడు సుధాక‌ర్ రెడ్డి

నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాక్‌..

నెల్లూరు: రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌సీపీలోకి వివిధ పార్టీలకు చెందిన నేతలు,కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో మంత్రి సోమిరెడ్డి సోదరుడు సుధాకర్‌ రెడ్డి వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సమక్షంలో  సుధాకర్‌రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. సోమిరెడ్డి అవినీతి సహించలేకే నేతలు టీడీపీని వీడుతున్నారని కాకాణి అన్నారు. ఇటీవ‌ల టీడీపీకి చెందిన అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిలు టీడీపీ వీడి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అలాగే ప‌లువురు నేత‌లు  జై రమేష్,  ఇరిగెల రాంపుల్లారెడ్డి తదితరులు వైయ‌స్ఆర్‌సీపీలోకి చేరారు.

వైయస్‌ఆర్‌సీపీలోకి ఏఎంపీ మాజీ ఛైర్మన్‌...

వాకాడులో వైయస్‌ఆర్‌సీపీ నేత నేదురుమల్లి రామ్‌కుమార్,ఎమ్మెల్యే చిలివేటి సంజీవయ్య,మాజీ ఎంపీ వరప్రసాద్‌రావు,గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఏఎంపీ మాజీ ఛైర్మన్‌ దువ్వూరు మధుసూదన్‌రెడ్డితో పాటు పలువురు టీడీపీ కార్యకర్తలు  వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Back to Top