ఆక్వా క‌ల్చ‌ర్ అభివృద్ధిలో ఏపీ ముందంజ‌

మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు

డయిరీ రంగంలో డిజిటలైజేషన్ సమూల మార్పుకు దోహదం

గుజరాత్ మిల్క్ సొసైటీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం

విశాఖ‌:  ఆక్వా కల్చర్ అభివృద్ధిలో ఏపీ టెక్నాలజీ పరంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముందుందని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు అన్నారు. అమెరికా, చైనా, ఫ్రాన్స్‌ దేశాలకు ఆంధ్ర రొయ్య పిల్లలు ఎగుమతులు చేస్తూ రికార్డ్ సృష్టించిందని.. ఆక్వా రంగంలో ఏపీ ప్రపంచ దేశాలకు హబ్‌గా మారిందని తెలిపారు.  విశాఖలో శుక్ర‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు.  
డయిరీ రంగంలో డిజిటలైజేషన్ సమూల మార్పుకి దోహద పడిందన్నారు. పశువుల సంతానోత్పత్తిలో డిజిటల్ హెల్త్ కేర్ ఉపయోగ పడుతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిజిటల్ టెక్నాలజీ వినియోగంలో మొదటి స్థానంలో ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పశువుల సంతానోత్పత్తిలో ఏపీ రికార్డ్ స్థాయిలో టెక్నాలజీ పరంగా అభివృద్ధి సాధిస్తోందన్నారు. మిషన్ పుంగనూరు పేరిట పాల సేకరణలో లాభాలార్జన జరగుతోందని.. 2000 బల్క్ కూలింగ్ పాయింట్స్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. గుజరాత్ మిల్క్ సొసైటీతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. 
 
విశాఖ ఇకపై అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్‌ అని మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే ప్రభుత్వ లక్ష్యమని.. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామ‌న్నారు.  కర్నూల్‌ను న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా మారుస్తామని.. విశాఖ నుంచి పరిపాలన కొనసాగిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Back to Top