రాజధాని అంటే భూములా? పరిపాలనా?

మంత్రి  సిదిరి అప్పలరాజు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.జె.ఆర్‌ సుధాకర్‌ బాబు

అమరావతి రాజధానిగా ఉండదు అని వైయ‌స్ జగన్‌గారు ఏరోజూ చెప్పలేదు

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉంటే చంద్రబాబుకు నష్టం ఏమిటి? 

కర్నూలులో ఒక రాజధాని ఉంటే  బాబుకు వచ్చిన కష్టం ఏమిటి? 

ఇది అన్యాయం టు అన్యాయం యాత్ర

అమ‌రావ‌తి:  రాజధాని అంటే భూములా? పరిపాలనా? అని మంత్రి  సిదిరి అప్పలరాజు, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే టి.జె.ఆర్‌ సుధాకర్‌ బాబు ప్ర‌శ్నించారు.  రాజధాని అంటే 30 వేల ఎకరాలకు సంబంధించిన ప్రయోజనాల పరిరక్షణా? చంద్రబాబు బినామీల ప్రయోజనాల పరిరక్షణా? లేక ఆరు కోట్ల ప్రజల ప్రయోజనాల రక్షణా? అంటూ నిలదీశారు.  అమరావతి రాజధానిగా ఉండదు అని వైయ‌స్ జగన్‌గారు ఏరోజూ చెప్పలేదు. అమరావతి మూడు రాజధానుల్లో ఒకటి అని చెప్పారు. అమరావతికి అగౌరవం ఎక్కడా జరగలేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఆత్మ గౌరవం ఉండదా? అని ప్ర‌శ్నించారు.  రాయలసీమ హక్కుల ఉద్యమాన్ని చూస్తున్నాం. ఎందుకు అంతగా ప్రజలు మద్దతు పలుకుతున్నారు? ఉత్తరాంధ్ర ఆకాంక్షలకు చంద్రబాబు ఏం సమాధానం ఇస్తారు?

ఇంకా వారు ఏమ‌న్నారంటే..

 

  • – రాజధాని భూముల్ని బినామీలతో కొనిపించిన చంద్రబాబు ఈ రోజు తిరుపతి సభ చూస్తే... యాత్రల్లో బినామీ యాత్రలు కూడా ఉంటాయని బాగా నిరూపించాడు. ఇది తానే చేయించానని చివరి రోజు పరిగెత్తుకు వచ్చేశాడు. 
  • – చంద్రబాబు చేయించినది పాదయాత్ర కాదు. ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు, మొత్తం రాష్ట్రం మీద దండయాత్ర. 
  • – న్యాయస్థానం టు దేవస్థానం అన్నారు. కాదు... ఇది అన్యాయం టు అన్యాయం యాత్ర. 
  • – ఇది స్టేట్‌కు సంబంధించిన యాత్ర కాదు. ఇది కేవలం చంద్రబాబు బినామీ భూముల రియల్‌ ఎస్టేట్‌కు సంబంధించిన వ్యవహారం. 
  • – రాష్ట్రంలో ఒక పోలవరం ప్రాజెక్టునే తీసుకోండి. ఇతర ప్రాజెక్టులను తీసుకోండి. గ్రామాలకు గ్రామాలే ఖాళీ చేయించాల్సి వచ్చింది. వేల ఎకరాలను భూసేకరణలో తీసుకోవడం జరిగింది. వారెవరూ తాము త్యాగాలు చేశామని పదే పదే చెప్పుకోవడం లేదు. 
  • – అమరావతి రైతులకు చంద్రబాబు చేసిన న్యాయమూ లేదు. మేం చేసిన అన్యాయం లేదు. మిగతా రైతుల కంటే అమరావతిలో రైతులకు మరింతగా న్యాయం చేయడానికి మా ప్రభుత్వం ప్రయత్నించింది తప్ప, చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించలేదు. 
  • – ఈ నేపథ్యంలో అమరావతి రైతుల పాదయాత్ర ఎవరి కోసం? భూముల కోసం రాజ«ధానా. లేక రాజధాని కోసం భూములా? అన్ని ప్రాంతాలకు న్యాయం చేయడం కోసం రాజధానా. లేక చంద్రబాబు కోసం, అతడి వర్గం కోసం రాజధానా. రాష్ట్రంలో ఒకే ఎయిర్‌పోర్టు, ఒకే రైల్వే స్టేషన్, ఒకే బస్‌ స్టేషన్‌ ఉంటే సరిపోతుందా? 
  • – అన్యాయం జరిగితే న్యాయస్థానానికి వెళ్లొచ్చు. తప్పు జరిగితే ఆ తప్పు చేసిన వాణ్ని శిక్షించమని దేవస్థానానికి వెళ్లొచ్చు. కానీ ఇక్కడ అన్యాయం చేసింది చంద్రబాబే. తప్పు చేసింది కూడా చంద్రబాబే. ఆ తప్పుకు మద్దతు ఇస్తూ ఈ యాత్రలు, సభలు ఏమిటి? 
  • – పైగా అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని శ్రీకాకుళం నుంచి విశాఖ వరకు ఉత్తరాంధ్రలో... అలాగే చిత్తూరు నుంచి అనంతపురం వరకు రాయలసీమలో... నెల్లూరు నుంచి గుంటూరు వరకు, తూర్పు గోదావరి నుంచి కృష్ణా వరకు మద్దతుగా యాత్రలు చేశారట.
  • –ఎందుకు చేస్తారండి? తాము చల్లగా ఉండాలని, తమ కుటుంబం చల్లగా ఉండాలని ఎవరన్నా పూజలు చేసుకుంటారు. ఒక సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు. అలా కాకుండా మేం నష్టపోయి, మా పక్కింటి వాడు బాగుండాలని పూజలు, వ్రతాలు ఎవరైనా చేసుకుంటారా? పైగా దానికి ఒక పెద్ద బ్రాండింగా? హడావుడి–హంగామానా? 
  • – ఇటువంటి రియల్‌ ఎస్టేట్‌ పాదయాత్రకు, అందరికి అన్యాయం చేయాలనే పాదయాత్రకు దత్తపుత్రుడిæ మద్దతా? యాత్ర టీడీపీది అని తెలిసి బీజేపీ కూడా అందులో పాల్గొంటుందా?  అమరావతిని స్కామ్‌ క్యాపిటల్‌ అని చెబుతారా? కానీ సిగ్గులేకుండా మళ్లీ దానికే మద్దతు ఇస్తున్నాం అంటారా? స్కామ్‌కు మద్దతు ఇవ్వడం అనే కాన్సెప్ట్‌ దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా? 
  • – విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఉంటే చంద్రబాబుకు నష్టం ఏమిటి? తాను కొనిపించిన భూముల ధరల గురించే కదా? తన వారి భూముల ధరల గురించే కదా?
  • – కర్నూలులో ఒక రాజధాని ఉంటే చంద్రబాబుకు వచ్చిన కష్టం ఏమిటి. ఈ కేంద్రీకరణ ధోరణులకు కమ్యూనిస్టు పార్టీ వంత పాడడం ఏమిటి? 
  • –బాబు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకు తోకలుగా పనిచేసే సీపీఐ, జనసేన పార్టీలు బాబుకు బాకా ఊదాయి. 
  • – ప్రపంచ కమ్యూనిస్ట్‌ చరిత్రను తిరగరాస్తూ... కార్ల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలకు పూర్తిగా సమాధి కట్టేసి... ఏకంగా రియల్‌ఎస్టేట్‌ భూస్వామ్య ఉద్యమానికి, బినామీ రాజకీయానికి ఏపీ సీపీఐ మద్దతు పలకటం ద్వారా సరికొత్త రికార్డు సృష్టించింది. 
  • – వీరంతా చంద్రబాబు పాపాల్లో కూడా వాటాదారులు కావటానికి సిద్ధపడిన వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు.  
  • – అందరూ బాగుండాలనే పార్టీ మాది. మా నాయకుడి సిద్ధాంతాం అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని. ఆయన ఆలోచన అందరికీ ఆత్మగౌరవం ఉంటుందన్నది. జగన్‌గారి సిద్ధాంతం అందరికీ అన్నీ అందితేనే సామాజిక న్యాయం అని, ప్రాంతాలకు న్యాయం జరిగితేనే సామాజిక న్యాయానికి మరింతగా అర్ధం ఉంటుందని ఆయన నమ్మారు. ఎవరికీ అన్యాయం చేయంటం లేదు. 
  • – బాబుది మాత్రం ఒకటే సిద్ధాంతం. నేను, నా కొడుకు. నా వాళ్లు. వీరు బాగుంటే లోకం అంతా బాగున్నట్లే. యాత్ర ముగిసింది కదా అని దీన్ని ఒక పెద్ద విజయంగా చూపించుకోవాలనుకుంటే వాళ్ల ఇష్టం. ఇది ఎవరూ పట్టించుకోని యాత్ర.
  • – ఇది ఒక పనికిమాలిన యాత్ర. ఇది ఒక అన్యాయాన్ని సమర్థించే యాత్ర. ఇది ఒక సిగ్గు పడాల్సిన యాత్ర. ఇది బాబు భజన బృందం తప్ప... బాబు బాగుంటేనే మేము బాగుంటాం అనే మీడియా తప్ప, ఎవరూ సమర్థించని యాత్ర. 
  • – పరిష్కారం డీసెంట్రలైజేషన్‌ మాత్రమే. ఆ విషయం ముఖ్యమంత్రి గారు ఇప్పటికే స్పష్టం చేశారు. పరిష్కారం ప్రాంతాలన్నింటికీ న్యాయం చేయడం మాత్రమే. ప్రాంతాలకు కూడా ఆత్మగౌరవం ఉంటుందని గుర్తుంచుకోవాలి. శాశ్వత పరిష్కారం డీసెంట్రలైజేషన్‌ మాత్రమే అని మరోసారి గుర్తు చేస్తున్నాం.
Back to Top