2024లో సరైన ముహూర్తం ఉంది.. తేల్చుకుందాం

మంత్రి సీదిరి అప్పలరాజు

పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే తాట తీస్తాం

చంద్రబాబు మాట్లాడే ముందు చేసిన దుర్మార్గాలు గుర్తుకు రావా?

చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది

గత ఎన్నికల్లో 23 సీట్లతో ప్రజలు ఓ మూలన కూర్చోబెట్టారు

2024లో చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెబుతారు

సైకో చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది

శ్రీకాకుళం: దమ్ముంటే రండి తేల్చుకుందామని చంద్రబాబు తొడగొడుతున్నాడు.. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. 2024లో సరైన ముహూర్తం ఉంది..అప్పుడు తేల్చుకుందాం రా అని  మంత్రి సీదిరి అప్పలరాజు చంద్రబాబుకు సవాలు విసిరారు. గత ఎన్నికల్లో 23 సీట్లతో ప్రజలు ఓ మూలన కూర్చోబెట్టారని, వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. మాపై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించమంటే కాల్పులు జరిపించిన వ్యక్తికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని ప్రశ్నించారు. గతంలో ఎమ్మెల్యేలకు ప్యాకేజీ ఇచ్చి లాక్కున్నారు.. ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని చంద్రబాబు వేధించాడని గుర్తు చేశారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క మంచి పథకమైనా ఉందా అని నిలదీశారు. సైకో చంద్రబాబును ప్రజలు తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. 

 

మంత్రి సీదిరి అప్పలరాజు ఏం మాట్లాడారంటే:

14ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తి మాట్లాడే మాటలా ఇవి..!:
- ఈ మధ్య చంద్రబాబు గన్నవరం వెళ్లి తొడలు కొట్టడం, మిస్టర్‌ మాలోకం మీసాలు మెలేయడం చూస్తున్నాం
- ఈ రాష్ట్రంలో అసలు ఎవరు సైకో అనేది కూడా ప్రజల్లో చర్చ జరగాలి
- పట్టాభి మీ ఊరొస్తాను...మీ సంగతి చూస్తాను అని రెచ్చగొడితే గన్నవరంలో పట్టుకుని తన్నడానికి రెడీ అయ్యారు
- పాపం పోలీసులు అడ్డుపడి కంట్రోల్‌ చేశారు...పట్టాభికి బట్టలు ఊడదీయకుండా కాపాడారు
- ఇలాంటి వెధవలు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి మాటలు మాట్లాడినా.. ప్రజలు బట్టలు ఊడదీసి తంతారు. 
- ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ఊరేగింపు చేసి ప్రజలు బుద్ధి చెప్తారు.
- తొడగొట్టి దమ్ముంటే నువ్వు రా...లగ్నం పెట్టుకుని తేల్చుకుందాం.. అని చంద్రబాబు అంటున్నాడు
- పోలీసులు లేకుండా రా నడిరోడ్డుమీద తేల్చుకుందాం అంటున్నాడు
- ఇవా 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నోటి నుంచి వినాల్సిన మాటలు..?
- నేనేం ముసలి వాడిని అవ్వలేదంటూ..దాన్ని నిరూపించుకోవడానికి బస్సులు లారీలు ఎక్కేస్తున్నాడు
- ముహూర్తం పెట్టి తేల్చుకోవడానికి ఇదేమన్నా సినిమానా చంద్రబాబూ..?
- మొన్నటి ఎన్నికల్లో 23 సీట్లతో నిన్ను మూలన కూర్చోబెట్టారు చూడు.. అదీ బట్టలు ఊడదీయడం అంటే
- నువ్వు పెట్టుకున్నా..పెట్టుకోకపోయినా 2024లో మీకు ప్రజలు సరైన ముహూర్తం పెట్టారు. మిమ్మల్ని, మీ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేసే ముహూర్తం పెట్టారు. 
- ఆ ముహూర్తంలో తేల్చుకుందాం...ఎందుకు తొందరపడిపోతున్నావ్‌.

బాబు ఏనాడైనా ప్రజాస్వామికంగా వ్యవహరించాడా..?
- చంద్రబాబు హయాంలో విద్యుత్‌ చార్జీలు తగ్గించండి అని ధర్నా చేస్తే కాల్చి చంపడం ప్రజాస్వామికమా..?
- మాట్లాడే ముందు ఇలాంటి దుర్మార్గాలు మీకు గుర్తుకు రావడం లేదా..?
- 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం ఏ రకంగా ప్రజాస్వామ్యమో చంద్రబాబు చెప్పాలి
- ఏది ప్రజాస్వామ్యం..ఏది అప్రజాస్వామ్యం అనేది రాష్ట్ర ప్రజలు చర్చించుకోవాలి
- కాపుల రిజర్వేషన్లపై నువ్విచ్చిన హామీని అమలు చేయమని ముద్రగడ పద్మనాభం గారు ధర్నా చేస్తే వారి కుటుంబాన్ని ఎలా హింసించావో చంద్రబాబు గుర్తుతెచ్చుకోవాలి.
- అది ఏ రకంగా ప్రజాస్వామ్యమో చంద్రబాబు సమాధానం చెప్పాలి.
- ఎమ్మెల్యే రోజాను ఒక ఏడాదిపాటు సస్పెండ్‌ చేశారు...అది ఎలా ప్రజాస్వామ్యమో చెప్పాలి

నీ పేరు చెబితే గుర్తొచ్చే ఒక మంచి పని చెప్పు బాబూ:
- నా హయాంలో ప్రజలకు ఫలానా మేలు చేశాను...నాకు మళ్లీ అవకాశం ఇవ్వండి అని ఎవరైనా కోరతారు
- ఏ ఒక్క సందర్భంలోనైనా చంద్రబాబు అలా ప్రజల్ని అడిగాడా..? అసలు అలా అడగగలిగే దమ్ముందా..?
- నీ పేరు చెబితే గుర్తొచ్చే ఒక మంచి పని అయినా ఉంటే.. చేతనైతే చెప్పు చంద్రబాబూ..
- బీసీలకు నువ్వేం చేశావో చెప్పు...ఇంకా ఇస్త్రీ పెట్టెలు, కుట్టు మిషన్లు ఇచ్చాను అనడానికి సిగ్గు లేదా..?
- నువ్విచ్చిన ఆదరణ పథకానికి బాగుపడ్డ ఒక్క బీసీ కుటుంబాన్ని చూపమంటే చూపలేకపోతున్నావు
- తోలు తీస్తా..తోకలు కత్తిరిస్తా.. అంటూ మా బీసీ సోదరులపై నువ్వు చూపించిన కుల అహంకారం మేం మర్చిపోలేదు
- చంద్రబాబు అనే ఒక దుర్మార్గుడిని కనుచూపుమేరకు కనిపించకుండా తరిమి కొట్టడానికి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు సిద్ధంగా ఉన్నారు

ప్రజలను వంచించినందుకు క్షమాపణ అడుగు బాబూ..:
- రావణాసురిడితో యుద్ధం చేస్తున్నాం.. అని పది తలల్లో విషం నింపుకున్న ఒక రావణాసురుడు చెప్పడం విడ్డూరంగా ఉంది
- చంద్రబాబు చేతిలో వంచించబడిన సామాజిక వర్గాలు .. ఇప్పటికీ మర్చిపోలేదు
- చంద్రబాబు ఒక కుటుంబానికి మంచి చేశానని చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నాడు
- మేం గడప గడపకు వెళ్లి ప్రజలకు ఏమి చేశామో లెక్కలతో సహా వెళ్తున్నావు
- మీరు ఇంటింటికీ వెళ్లి క్షమించమని కాళ్లమీద పడండి...అంతే తప్ప నీకు మరొక మార్గం లేదు చంద్రబాబూ..
- కుల దురహంకారాన్ని చూపానని... మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కాళ్లమీద పడి క్షమాపణ అడుగు
- 2014–19 మధ్యే కాదు..నీ మొత్తం 14 ఏళ్ల పాలనలో ఒక్క కుటుంబానికి ఫలానా మంచి చేశాను అని చెప్పగలవా..?
- సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను  అమలు చేస్తున్నాం..
- గ్రామానికి కనీసం కోటి రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేశాం. ప్రతి 2వేల జనాభాకు కోటి రూపాయలు మంజూరు చేసి ఆ గ్రామానికి వసతులు సమకూరుస్తున్నాం
- గ్రామాల్లో నాడు-నేడు కింద లక్షలాది రూపాయలు ఖర్చు చేసి బాగు చేసిన పాఠశాలలను చూడు చంద్రబాబూ.. నిన్ను చూసి వెక్కిరిస్తాయి అవి...నీ పాలనలో బ్రష్టు పట్టిన స్కూళ్లు, ఇప్పుడు ఎలా వెలిగిపోతున్నాయో చూడు.
- ఒక కుటుంబం నుంచి గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రానికి మేమేం చేశామో ధైర్యంగా చెప్పగలం
- నీకు ఇది సాధ్యమా..? నువ్వు నిజంగా అద్భుతంగా పరిపాలించాను అనుకుంటే నీవు చేసిందేదో చెప్పి, ధైర్యంగా ఓట్లు అడుగు. అది చేయకుండా ఎంతసేపటికీ కుట్రలు, కుతంత్రాలు ఎందుకు..? 
- అమ్మ ఒడి, చేయూత, 108, ఆరోగ్య శ్రీ, జగనన్న విద్యా దీవెన, వైఎస్సార్‌ ఆసరా...ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నాం. 
- రాజశేఖరరెడ్డిగారు, జగన్‌ గారి పేర్లు చెప్తే గుర్తుకొచ్చే సంస్కరణలు, పథకాలు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి
- నీ పేరు చెప్తే గుర్తుతెచ్చుకోడానికి ఏమున్నాయ్‌...చేతనైతే చెప్పి ఓట్లడుగు. 

లోకేశ్ ఒక పొలిటికల్ కమెడియన్:
- లోకేశ్‌ మీసం మెలేస్తున్నాడు..రా‌ చూసుకుందాం అంటుంటే బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం ఫైర్‌ డైలాగ్‌ గుర్తోస్తుంది
- ఒక కమెడియన్‌ సీరియస్‌ రోల్‌ చేస్తున్నట్లుంది.నీ బాడీ లాంగ్వేజీకి నీ డైలాగులకు ఏ మాత్రం పొంతనలేదు లోకేశ్‌
- యువగంగాళంలో ఆయన చేస్తున్న చేష్టలు, ఆటో డ్రైవర్‌లా డ్రస్, జంపింగులు, రన్నింగులు అన్నీ జగన్‌ గారిని ఫాలో అవుతున్నట్లు కన్పిస్తున్నాయి
- రాజశేఖరరెడ్డి గారు పాదయాత్ర చేస్తే చంద్రబాబూ చేశాడు..ఎవరికైనా చంద్రబాబు చేసిన పాదయాత్ర గుర్తుందా..?
- అలానే లోకేశ్‌...వైయ‌స్ జ‌గ‌న్‌ గారిని ఫాలో అవుతున్నాడు- లోకేశ్‌ ఏ రోజూ వాళ్ల నాన్నను మాత్రం ఫాలో అవ్వలేదు
- వాళ్ల నాన్న ఏం చేశాడో చెప్పలేక...నిత్యం జగన్‌ గారి పేరు స్మరించుకుంటూ వెళ్తున్నాడు
- ఒకే ఒక విషయంలో లోకేశ్‌, చంద్రబాబును ఫాలో అవుతున్నాడు..అది బూతులు తిట్టడం మాత్రమే
- మీరు పొర్లు దండాలు పెట్టినా, తలకిందులుగా తపస్సు చేసినా ప్రజల మనస్సులో ఉన్న జగన్‌ గారిని మీరు చెరపలేరు
- 2024 ఎన్నికల్లో జగన్‌ గారు నిర్ణయించుకున్న 175 లక్ష్యం ఖచ్చితంగా గెలిచి తీరుతాం

అవును లోకేశ్‌ మూర్ఖుడే...కాదన్నది ఎవరు..?:
- లోకేశ్‌ మూర్ఖుడే..ఎవరు కాదన్నారు..అతనంత మూర్ఖశిఖామణి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరు
- పగటి కలలు కనడం తప్ప లోకేశ్‌ చేసిందేమీ లేదు..చంద్రబాబు ఎప్పటికీ అధికారంలోకి రాలేడు
- లోకేశ్‌ పాదయాత్రకు ఆదరణ ఎక్కుడుంది..?  పనికిమాలినోడి యాత్ర అని ఎల్లోమీడియా వాళ్లే తీసి పక్కన పడేశారు
- మా నాన్న ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేము అని లోకేశ్‌ చెప్పకనే చెప్తున్నాడు
- అందుకే జూనియర్‌ ఎన్టీఆర్‌ వచ్చి సాయం చేయాలని మేం అడుక్కుంటున్నాం అని లోకేశ్‌ చెప్తున్నాడు
- జూనియర్‌ ఎన్టీఆర్‌ మాటే వినపడకూడదు అని చంద్రబాబు ఏబీఎన్‌ రాధాకృష్ణతో చెప్పిన మాటలు అందరూ విన్నారు
- నందమూరి కుటుంబం..నారా వారి కుటుంబం పల్లకీ మోయడానికి మాత్రమే ఉపయోగపడుతోంది
- అలా చంద్రబాబు నందమూరి కుటుబాన్ని వాడుతున్నాడు
- జూనియర్‌ ఎన్టీఆర్‌ విజ్ఞుడు...అన్ని విషయాలు ఆయన పరిగణలోకి తీసుకుని వీరి ట్రాప్‌లో పడడని భావిస్తున్నా

జర్నలిజం విలువలను బాబుకు తాకట్టు:
- చంద్రబాబు లక్ష్యం ఒక్కటే...కేవలం భావోద్వేగాలతో విద్వేషాలు సృష్టించాలనేది
- మిగతా విషయాలపై ప్రజల్లో చర్చకు అవకాశం లేకుండా చేయాలని ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నాడు
- వీటన్నిటికీ స్క్రిప్ట్‌ రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 నాయుడులు అందిస్తున్నారు
- రామోజీరావు అయితే ఏకంగా పాత ఫోటోలు తీసుకొచ్చి మరీ అచ్చోశారు
- ఆ ఫోటోలను మీ పత్రికలో మీరే ప్రింట్‌ చేయించారా... లేక టీడీపీ ఆఫీసులో ప్రింటయ్యాయా అనేది రామోజీ సమాధానం చెప్పాలి 
- మీరేమో విలువలు, విశ్వసనీయత అంటూ ఎడిటోరియళ్లు రాస్తారు
- మీడియా మొఘల్‌ అంటూ గొప్పలు చెప్పుకుంటారు..కించిత్‌ సిగ్గులేని రాతలు రామోజీ రాస్తున్నాడు
- జర్నలిజం విలువలు, లక్ష్యం అంతటిని ఈ మీడియా పెద్దలు చంద్రబాబు లాంటి వారికి అమ్మేస్తున్నారు
- ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా ఆలోచించుకోవాలి...సమాజంలో మార్పు తీసుకురావాలని మీరంతా భావించి ఈ రంగంలోకి వచ్చారు
- ఎండనక వాననక నిజాలు వెలికితీసేందుకు మీరంతా పనిచేస్తుంటే వీళ్లు మాత్రం జర్నలిజం విలువలను చంద్రబాబుకు అమ్మేస్తున్నారు.

చార్జ్‌షీట్లు వీరే వేస్తారు...శిక్షలు వీళ్లే విధిస్తారు..:
- వివేకా కేసులో ఎల్లో మీడియా వాళ్ళే చార్జ్‌షీట్లు వేసేస్తారు..సీబీఐ వారి మనసులో ఏముందో కూడా వీళ్లే రాసేస్తారు
- బాత్‌ రూమ్‌లలోకి ఎలా దూరిపోతారో తెలియదు..విచారణ గదిలోకి ఎలా మైకులు తీసుకెళ్తారో కూడా తెలియదు
- వీళ్లే అన్నీ రాసి నిర్ధారణ కూడా చేసేస్తూ మీడియా పేరు చెప్పుకుని పబ్బం గడుపుకుంటున్నారు
- ఇలాంటి దిగజారుడు పనులు చేస్తున్న మీడియా పెద్దలు ఇప్పటికైనా మీ మనసును ప్రశ్నించుకోవాలి.

Back to Top