నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలి

మంత్రి రోజా

తిరుమల: భువనేశ్వరికి నిజం గెలవాలని ఉంటే సీబీఐ ఎంక్వైరీ కోరాలని మంత్రి ఆర్కే రోజా సూచించారు. మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నామన్నారు. అర సున్న, అర సున్న కూర్చుని లోపల ఉన్న గుండు సున్నా కోసం దిశానిర్దేశం చేశారంటూ టీడీపీ, జనసేన మీటింగ్‌పై మంత్రి రోజా సెటైర్లు విసిరారు. మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పవన్‌,లోకేష్‌ ఇద్దరినీ ప్రజలు ఓడించారు. ఇదేమీ కర్మరా బాబూ అని ఆ పార్టీ నేతలే వాపోతున్నారు’’ అని ఎద్దేవా చేశారు. 14 ఏళ్లలో మేం ఇది చేశామని ఓట్లు అడిగే దమ్ము టీడీపీకి లేదన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై సీబీఐ ఎంక్వైరీ వేయించుకుంటే నిజం తప్పకుండా గెలుస్తుంది.. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌పై నిజం గెలవాలని సీబీఐ ఎంక్వైరీ వేసుకుంటే హెరిటేజ్‌లో ఎవరెవరు ఉన్నారో అందరూ బయట పడతారు. పవన్, లోకేష్‌ను చూస్తే పాడుతా తీయగా సెలక్షన్‌కి ఇటు ఒక బ్యాచ్, అటు ఒక బ్యాచ్ కూర్చుకుని సెలక్ట్ చేసినట్లు ఉందంటూ రోజా చురకలు అంటించారు.

 టీడీపీకి 14 సంవత్సరాల్లో మ్యానిఫెస్టో ఇది చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం లేదు.. మొదటిసారి సీఎం అయిన వైఎస్‌ జగన్‌ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు 98 శాతం పూర్తి చేశారు. వై ఏపీ నీడ్స్ వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అని చెప్పి గడప గడపకు వెళ్తున్నాం.. వై ఏపీ నీడ్స్ చంద్రబాబు, వై ఏపీ నీడ్స్ పవన్ అని ప్రజల ముందుకు వెళ్ళే దమ్ము ఉందా..?. ప్రజలు మూతి పగలగొడతారని తెలుసుకున్న టీడీపీ, జనసేన ఏపీ హేట్స్ అనే ప్రోగ్రాంతో వెళ్తున్నారంటూ  మంత్రి రోజా దుయ్యబట్టారు.

Back to Top