పవన్‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాలి

మంత్రి రోజా 
 

 
 గుంటూరు: పవన్ క‌ళ్యాన్ రోడ్డుపై రౌడీలా రోడ్‌షోలు చేయడమేంటి?. నిజంగా  ఆయ‌న‌కు దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను దింపాల‌ని మంత్రి ఆర్కే రోజా స‌వాలు చేశారు.  పవన్‌ కల్యాణ్‌ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి అని హితవు పలికారు.  మంత్రి రోజా ఆదివారం మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో మళ్లీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డే గెలుస్తారు. పాలిటిక్స్‌ అంటే ప్రతీరోజు యుద్ధమే. పవన్‌ నువ్వు సినిమాలో హీరో వేషాలు వేసి ఇక్కడకి వచ్చి జీరో వేషాలు వేస్తే ప్రజలు హీరోను చేయరు. ఇప్పటంలో జరిగిన దానికి ప్రధాన కారణం చంద్రబాబు. నారా లోకేశ్‌ అక్కడ పోటీచేసి ఓడిపోతే అక్కడ ఓ సమస్య వస్తే లోకేశ్‌ లేదా చంద్రబాబు వెళ్లాలి. అలాకాకుండా పవన్‌ను పంపించి ఫూల్‌ని చేసింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబును తిట్టకుండా సంబంధంలేని సీఎం వైయ‌స్‌ జగన్‌ను నిందిస్తున్నారు. పవన్‌ వ్యాఖ్యలు చూస్తుంటే కేవలం తన ఉనికి కోసమే సీఎం వైయ‌స్‌ జగన్‌పై నిందలు వేస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదు అని వ్యాఖ్యలు చేశారు. 

Back to Top