అన్ని ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ 

మంత్రి ఆర్కే రోజా

 కృష్ణా జిల్లా:  మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎన్నికల్లోనూ వార్ వన్ సైడ్ అని తేలిపోయింద‌ని మంత్రి ఆర్కే రో్జా అన్నారు. ప్రజలు వైయ‌స్సార్‌సీపీకే మద్దతుగా నిలిచారు. ఇంకా చంద్రబాబుకి అర్ధం కావడం లేదు. సిగ్గు లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్ చేస్తున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. శుక్ర‌వారం కృష్ణా జిల్లాలో నిర్వ‌హించిన కాపు నేస్తం కార్య‌క్ర‌మంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని మండిపడ్డారు.  రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారన్నారు. చంద్రబాబు, బీజేపీ, పవన్‌ కలిసి వచ్చి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. కాపులకు చంద్రబాబు చేసింది అక్రమ కేసులు, లాఠీ దెబ్బలు, అవమానాలు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడిని తరిమికొట్టాలని మంత్రి రోజా అన్నారు.
 
 చంద్రబాబు ఫ్రస్టేషన్ పీక్స్‌లో ఉంది. ప్రజలు వైయ‌స్‌ జగన్‌ను ప్రేమగా దగ్గరికి తీసుకోవడం చంద్రబాబు సహించలేకపోతున్నాడు. ఇప్పటికైనా పద్దతి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుంది. వైయ‌స్ జగన్ బయటికి రావడం లేదంటున్నారు. బయటికొస్తే ప్రజల్లో వస్తున్న అభిమానం చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని మంత్రి రోజా అన్నారు.
 

Back to Top