అన్నింటా ఏపీనే టాప్‌

ర‌వాణ, సమాచార శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య(నాని) 

అటు సంక్షేమంలోనూ.. ఇటు వ్యాక్సినేషన్ లోనూ దేశం యావత్తూ ఏపీ వైపు చూస్తోంది

 ఒక్క రోజులోనే 13 లక్షలకు పైగా వ్యాక్సిన్లు వేసి దేశంలోనే ఒక రికార్డు 

 వ్యాక్సినేషన్ పై విమర్శలు చేసే వారికి ఇది చెంప పెట్టు 

 అసలు ఇంతవరకు టెండర్లు ఫైనల్ కాలేదు.. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై ఎల్లో మీడియాలో కాకి గోల 

 భారత్ లో తయారయ్యే ఎలక్ట్రిక్ బస్సుల కోసం టెండర్లు పిలిస్తే.. ఎల్లో మీడియాకు ఎందుకు కడుపు మంట..? 

 తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ అన్ని రంగాల్లో అగ్ర‌స్థానంలో ఉంద‌ని  రవాణ, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) పేర్కొన్నారు. సంక్షేమం..అభివృద్ధితో పాటు ప్ర‌జ‌ల ఆరోగ్యం, విద్య‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర‌చ‌డంతో దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంద‌ని చెప్పారు. జూన్ 20న రాష్ట్రంలో ఒక్క రోజులోనే 13 లక్షల 72 వేల 481 మందికి వ్యాక్సిన్లు వేసి ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నిన్న భారతదేశంలోనే 47 శాతం ఒక్క ఏపీలోనే జరగటం మనకు గర్వకారణం. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు రాష్ట్రంలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. ఒకవైపు దేశంలోనే  కనీవినీ ఎరుగని రీతిలో, అందరికంటే మిన్నగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ.. మరోవైపు వ్యాక్సినేషన్ లో కూడా రికార్డు సృష్టించి దేశం యావత్తూ ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి తీసుకొచ్చాం. ఇది ఒక్క జగన్ మోహన్ రెడ్డిగారి నాయకత్వంలోనే సాధ్యమైందన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో సోమ‌వారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

 ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్దఎత్తున జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంపై  కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ అధికారులను సంప్రదిస్తున్నాయి. గతంలో కూడా ఒకే రోజు 6 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి రికార్డు సృష్టించాం. నిన్న 13 లక్షల మందికి వ్యాక్సిన్లు వేసి దేశం యావత్తు మన రాష్ట్రం వైపు చూసేలా చేశాం. ఇది మనందరికీ గర్వకారణం. మొత్తం కోటీ 11 లక్షలకు పైగా డోసుల వ్యాక్సిన్లు వేస్తే.. ఇందులో 1 కోటీ 10 లక్షల 9 వేల 821కు మొదటి డోసు, 27,32,592 మందికి రెండవ డోస్ వ్యాక్సిన్లు వేయడం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారు తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారానే ఇది సాధ్యమైంది. సచివాలయాలు, వాలంటీర్లు, ఏఎన్‌ ఎంలు అందరూ కృషి చేసి ఈ రికార్డును సాధించారు. 

 గత ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డిగారికి ఓటు వేసిన వారితో పాటు, ఓటు వేయని వారు కూడా ఈరోజు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ పై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వంపై అవాకాలు, చెవాకులు పేలుతున్న వారందరి నోళ్ళు మూతపడతాయి. వారందరికీ ఇది చెంప పెట్టు.
  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క సామర్థ్యం, ఇక్కడ వ్యవస్థల పనితీరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేంద్రం ఎంత త్వరగా వ్యాక్సిన్లు ఇస్తే.. అంతే శరవేగంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు వేయగల సామర్థ్యం ఉంది. వ్యాక్సిన్లు ఎన్ని కొనాలో, ఎక్కడ కొనాలో ఏపీతో పాటు మిగతా రాష్ట్రాలకు కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది. టీకాలు వేయడంలో ఈ ప్రభుత్వసామర్థ్యం చూశారు కాబట్టి వ్యాక్సిన్లు విరివిగా, పెద్ద ఎత్తున అందచేయాలని కేంద్రాన్ని కోరుకుంటున్నాం.  ప్రభుత్వం తరఫున వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందలు చెబుతున్నాం. 

 350 ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటుకు టెండర్లు పిలిస్తే.. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుంది 

  ఏపీఎస్ ఆర్టీసీలో పర్యావరణానికి మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ఆచరణలో పెట్టడంలో భాగంగా ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
 - ఎలక్ట్రిక్ బస్సుల కోసం గత ఏడాది టెండర్లు పిలిస్తే అప్పుడున్న బస్సు విలువ రూ.2.5 కోట్లు. కేంద్రం సబ్సిడీ ఇచ్చినా కూడా ఆ బస్సు నడపాలంటే అయ్యేఖర్చు ద్వారా ప్రయాణికులపై భారం అవుతుందని..  పర్యావరణ హితం అయినా, ప్రయాణికులపై భారం పడుతుందేమో అని, మార్కెట్‌లో బస్సుల ధరలు తగ్గుతాయేమో అని వేచి చూద్దామని జగన్‌ మోహన్‌ రెడ్డి గారు ఆలోచన చేశారు. వేచి చూసి మళ్లీ ఈ ఏడాది ఎలక్ట్రిక్‌ బస్సుల విలువ తగ్గడంతో ముందుకు వెళుతున్నాం.

  ఈ ఏడాది ఎలక్ట్రిక్ బస్సు ధర బహిరంగ మార్కెట్‌లో 2.5 కోట్ల నుంచి 1.70 కోట్లు ఉండటంతో పర్యావరణ హితం కోసం ముందుగా అనుకున్నట్లు కాకుండా  కేవలం 350 బస్సులు ఏర్పాటు చేద్దాం అనుకుని ప్రయత్నం చేస్తున్నాం. ఒకాయన టెండర్లు పిలిచిన వెంటనే జూన్ 16న ‘ఈ- బస్సులో ఒకే ఒక్కడు..’ అని రాశాడు. అంటే ఎలక్ట్రిక్‌ బస్సులో ఒకే ఒక్కడు అని.. ఆ పేపరులో వార్తను చూసిన వెంటనే ఆ పత్రిక యజమాని రాధాకృష్ణ బాధపడుతున్నట్లు ఏమైనా జరుగుతుందా అని ఆర్టీసీ అధికారులను కూడా విచారణ చేస్తే... నిబంధనలు ఏం మార్చలేరు. ఏపీ ప్రభుత్వం... భారతదేశంలో తయారయ్యే ఎలక్ట్రికల్‌ బస్సులు తయారు చేసే ఏ కంపెనీ అయినా రావచ్చొని టెండర్‌ ఆహ్వానించాం. 

 గతంలో భారత ప్రధాని మోడీ గారు.. మేక్ ఇన్ ఇండియా అంటే వీళ్ళే డబ్బాలు కొట్టారు. ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ నిబంధలను జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపాం. బస్సుల కొనుగోలు టెండర్లలో అడ్డగోలు నిబంధనలు అని, చెరువుడు కన్నీరు కార్చేశాడు. ఆయన విలాపం చెప్పలేకున్నాం. 
-  సింగిల్‌ టెండర్‌కు సై ఎవరికోసం ఇదంతా.. ఈ రకమైన  వక్రభాష్యాలు, విషం, బురద కలగలిపి వంట వండి పత్రికల్లో కథనాలు రాశారు. అక్రమ సంబంధం అంటగట్టడానికి ఏమైనా రాయొచ్చు. వీళ్లకు... చంద్రబాబు నాయుడు బాగుండాలి. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారు బాగుండకూడదన్నదే సింగిల్‌ పాయింట్‌ అజెండా. 

  21 జూన్‌ నాడు... బాప్ రే 290 కిలో మీటర్లా.. సింగిల్‌ ఛార్జ్‌తో మరో కంపెనీకి ఇచ్చేస్తున్నామని ఇవాళ రాశారు.
 పరుచూరి గోపాలకృష్ణ సినిమా డైలాగులకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు తేడా ఉండదు అని దీన్నిబట్టి అర్థం అవుతుంది. నరం లేని నాలుక, దానికి బొమిక ఉండదు, నరం ఉండదు. ఏది పడితే అది రాస్తారు. కనీసం ఉచ్ఛం, నీచం ఉండదు. ఒకరోజు.. ఒకాయనకు ఇచ్చేస్తున్నారు టెండర్‌ అని రాస్తే... అయిదు రోజుల తర్వాతేమో... ఇంకోకాయనకు ఇచ్చేస్తున్నారు టెండర్‌ అని రాస్తారు.  కనీసం చంద్రబాబు నాయుడుకు అయినా విచక్షణ ఉంటే బాగుండేది. ఇది జ్యోతిలో రాయించాం కదా... ఇంకో వార్తను ఈనాడులో రాయిస్తే బాగుంటుందని చెప్పినా సరిపోయేది. మరీ ఇంత అడ్డగోలుగానా?

 ఎలక్ట్రిక్ బస్సుల కోసం పలు సంస్థలు టెండర్లు వేశాయి. జ్యుడీషియల్ ప్రివ్యూలో నిబంధనలు పెట్టినా పట్టించుకోవడం లేదని రాశారు. అభ్యంతరాలు పెట్టిన ఎనిమిది కంపెనీల్లో టాటావాళ్లతో పాటు పలు కంపెనీలు ఉన్నాయి. ఆర్టీసీ లాంగ్‌ డిస్ట్రెన్స్‌ పెట్టాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ లో విశాఖ, విజయవాడ, తిరుపతిలో మాత్రమే సిటీ సర్వీసులు తిరుగుతున్నాయి. మనకు 20,30 నగరాలు లేవు కదా?.

 ప్రభుత్వం అనుకున్నది .. విశాఖపట్నంకు 100 బస్సులు, విజయవాడకు 50, గుంటూరుకి 50, కాకినాడకు 50, తిరుపతికి 100 బస్సుల చొప్పున కేటాయించాం. విశాఖకు వంద బస్సుల్లో కూడా విశాఖ-నర్సీపట్నం మధ్య 10, విశాఖ-కొత్తవలస 5, విశాఖ-అనకాపల్లి 18 బస్సులు, విశాఖ-భీమ్లీ బీచ్‌రోడ్డు 5 బస్సులు,  విశాఖ-విజయనగరం 22 బస్సులు తిప్పాలని, విశాఖ-శ్రీకాకుళం 20 బస్సులు, విశాఖ-రాజమండ్రి 10 బస్సులు తిప్పాలని, అలాగే విజయవాడకు వస్తే... విజయవాడ సిటీలో 32, విజయవాడ-మచీలీపట్నం 6 బస్సులు, విజయవాడ-జగ్గయ్యపేటకు 6 బస్సులు, విజయవాడ- ఏలూరుకు 6 బస్సులు తిప్పాలని, గుంటూరు డిపోకు 50 బస్సులు ఇవ్వాలని గుంటూరు-మాచర్ల 12 బస్సులు, గుంటూరు-విజయవాడ 28 బస్సులు, గుంటూర-నర్సరావుపేట 20 బస్సులు తిప్పాలని.

 అసలు ఇంతవరకు టెండర్లు ఫైనల్ కాలేదు.. ఎలక్ట్రిక్ బస్సుల టెండర్లపై ఎల్లో మీడియా కాకి గోల 
10. మళ్లీ అదే పత్రికలో బస్సులు తిరిగేది ఆంధ్రాలో అయితే.. ఫ్యాక్టరీ ఎక్కడ ఉంటే అక్కడ చూడటానికి వెళ్లామని రాస్తుంది. ఈ కుట్రలన్నీ చూస్తుంటే .. ఏపీ ప్రభుత్వంలో ఏ శాఖలో  ఏ టెండర్లు పిలిచినా, టెండర్ల కమిటీకి ఛైర్మన్ గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను పెడితేకానీ కుదిరేటట్లుగా లేదు. అలా అయితేనే ఆయన తన పత్రికలో ఇలా అడ్డగోలు వార్తలు రాయకుండా ఉంటాడేమో. ఇంత దుర్మార్గమా.... అచ్చు వేయడానికి ఒకాయన డబ్బులు ఇస్తున్నారని.. ఇష్టం వచ్చినట్లు రాతలా.. ఇదా జర్నలిజమా.. పేపర్ చూసి చెత్త బుట్టలో వేసే పరిస్థితిలో వార్తలు రాస్తే, ఇంత గౌరవప్రదమైన విలేకరి వృత్తిని దిగజార్చడమా?  భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే మీకులా రాసేవాళ్లు ఉండరేమో. మీకు మీరే చెల్లు. 

వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని అయినా అత్యంత పారదర్శకంగా చేపడుతుంది.  దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రతి టెండర్ ను జ్యుడీషియల్ ప్రివ్యూ పెడుతోంది. విజయవాడ-కాకినాడ 240 కిలో మీటర్లు దూరం. అలాగే కాకినాడ-వైజాగ్‌ తీసుకుంటే 174 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే విజయవాడ నుంచి విశాఖకు లేదా దూరప్రాంతాలకు వెళ్లినా 200 కిలోమీటర్లు ఉంటది. సింగిల్ చార్జింగ్‌తో లాంగ్‌ డిస్టెన్స్‌ ప్రయాణికుల సౌకర్యార్థం ఈ బస్సులను ప్రవేశపెట్టాలన్నది ఉద్దేశం.

 రాధాకృష్ణ ఫలానా వ్యక్తికి టెండర్ ఇవ్వాలని మీ పత్రికలోనే రాయండి. మీ కాకిగోల పడలేకపోతున్నామని ఫలానా వ్యక్తేకే ఇచ్చేయమని మా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిగారిని మేము అడుగుతాం. టెండర్‌ సిస్టమ్‌లో టెక్నికల్‌ బిడ్‌ అయ్యాకే.. బస్సు ట్రయిల్‌. ప్రొసిజర్‌ తెలుసుకోండి రాధాకృష్ణగారు. మీ ఇష్టానుసారం, లోకేష్‌ అన్నకున్నట్లు జరగవు ఇక్కడ. జగన్‌మోహన్‌రెడ్డిగారి ప్రభుత్వంలో పారదర్శకంగా అన్నీ జరుగుతాయి. బిడ్డర్‌ ఫైనల్‌ అయ్యాక... టెండర్‌ అయిన మూడు నెలల తర్వాత బస్సును తెచ్చి ట్రయిల్‌ తిప్పుతారు. ట్రయిల్‌ ఒకే అయితేనే ఎంవోయూ జరుగుతుంది. మీకు అంత ఇంట్రస్ట్‌ ఉంటే అవగాహన కోసం తెలుసుకోండి. తప్పుడు వార్తలు రాస్తే మిమ్మల్ని ఏ రకంగా అనుకోవాలి. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.  ఎలక్రికల్ బస్సులు టెండర్లు పారదర్శకంగా జరుగుతున్నాయి. ఈనెల 23 తర్వాత రివర్స్ టెండరింగ్ ఉంటుంది. ఎల్ 1గా వచ్చిన తర్వాత కూడా నెగోషియస్ జరుగుతాయి. 

 నిరుద్యోగ యువత చెప్పుడు మాటలు వినొద్దు 
సీఎం వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఇచ్చిన మాట మీద నిలబడతారు. ఒక మాట చెబితే.. వెనక్కి తగ్గరు. మాట నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. మాట మీద నెలబడతావా.. ప్రాణం వదులుకుంటావా అంటే మాట మీదే నిలబడతారు. చెప్పిన ఉద్యోగాలన్ని రాబోయే రోజుల్లో భర్తీ చేస్తాం. నిరుద్యోగ యువత చెప్పుడు మాటలు వినాల్సిన పనిలేదు. తప్పుడు వార్తలను వినాల్సిన పని లేదు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారు. ఎన్నికల ముందు చెప్పిన మాటను రాబోయే మూడేళ్లలో జగన్‌మోహన్‌ రెడ్డిగారు నిలబెట్టుకుంటారు.  

 ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే.. అందులోనూ రాజకీయమా లోకేష్..! 
 ఆడబిడ్డకు జరిగిన అఘాయిత్యాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడమా. అలాంటి సోదరిని పరామర్శించి, ధైర్యం చెప్పాలి. వారు కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి మనోబలాన్ని ఇవ్వాల్సిన వ్యక్తి రాజకీయాలు చేయడమా? చేతనైతే స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలి. ఇలాంటి వ్యక్తినా రాష్ట్ర ప్రజలు అయిదేళ్లు మంత్రిగా భరించామా.. అని ప్రజలు ఛీదరించుకుంటున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిగారు ఆడపిల్లల రక్షణ కోసం అనేక కార్యక్రమాలు తీసుకు వచ్చారు. మనిషి ముసుగులో ఉన్న మృగాలను కఠినంగా శిక్షిస్తాం. ఇప్పటికే బాధ్యతాయుతంగా హోంమంత్రి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రులు బాధితురాలిని పరామర్శించి, ధైర్యాన్ని ఇచ్చారు. ఆ గాయం నుంచి కోలుకోవాలని... అండగా ఉంటామని ధైర్యాన్ని నూరుపోశారు. వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడం జరిగింది. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ... ఓ మహిళకు జరిగిన అన్యాయన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం చూస్తుంటే ఇంతకన్నా దిగజారుడు ఉంటుందా?. అఘాయిత్యాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షలు ఉంటాయన్న సంకేతాలు ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా.. కొన్ని మానవ మృగాలు హేయమైన చర్యలకు పాల్పడుతున్నాయి. 

 లక్షల మంది యువతకు దారి చూపించామని చెప్పుకోవడమూ తప్పేనా..? 
 ఆంధ్రప్రదేశ్‌ సర్వీస్‌ కమిషన్‌ నుంచి ఇచ్చేవే ఉద్యోగాలా? బీజేపీ నేతలు దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు కదా.. మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. మీరు ఇచ్చిన మాటలు ఏం నిలబెట్టుకున్నారు. కనీసం మీ పంథా మార్చుకుంటే మంచిది, లేకుంటే ప్రజల దృష్టిలో ఇంకా దిగజారిపోతారు. వాలంటీర్లు నూటికి నూరు శాతం గౌరవ వేతనం తీసుకునే సేవకులు. మేం ఇంత మంది యువతకు దారి చూపించాం అంటే కూడా తప్పా.? మా ప్రభుత్వం ఇంతమంది యువతకు దారి చూపించామని చెప్పుకోవడం తప్పా? కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ఈ రెండేళ్లలో ఏం చేశామని  చెప్పుకుంటే కూడా ద్వందర్థాలు తీయడమేనా? చేసింది కూడా తప్పు అంటే ఏం చేయాలి.  చంద్రబాబు నాయుడు మాదిరిగా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎగ్గొట్టలేదే. 

 ఉద్యోగం ఊడిన రాజకీయ నిరుద్యోగి లోకేష్ 
 నారా లోకేష్‌ ప్రస్తుతం ఉద్యోగం ఊడిపోయిన రాజకీయ నిరుద్యోగి. దాన్ని పొందాలని ఎన్నో ప‍్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీలోకి మరొకరు అక్కర్లేదు ... లోకేష్‌ పనికొస్తాడు అనుకునేలా తాపత్రాయ పడుతున్నాడు. లోకేష్‌ తాను మనిషిని అనే విషయాన్ని మరిచిపోయి ముఖ్యమత్రిని అసభ్యంగా ఏరా.. ఒరేయ్ అని మాట్లాడుతున్నాడు. భయపడి చచ్చేవాడే... భయపడేలా బీరాలు, బింకాలు పలుకుతున్నాడు. వీళ్ల తంతు ఎలా ఉంటదంటే నేను లెగిస్తే మనిషిని కాలేను అంటాడు. ఒకసారి లెగమంటే లేవలేడు. లోకేష్ ను చూసి జాలిపడాల‌ని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. 

Back to Top