ఎన్నేళ్లు ఉన్నామన్నది కాదు..ఎంత గొప్పగా పాలించామన్నది ముఖ్యం

మంత్రి పేర్నినాని 

దేవుళ్లతో నాటకాలాడితే తగిన శాస్తి జరుగుతుంది

పార్లమెంట్‌ మెట్ల మీద ఫొటోలకు ఫోజులిచ్చారు

ప్రత్యేక హోదా సాధిస్తానని చంద్రబాబు ఉత్తర కుమార ప్రగ్బాలు పలికారు

చంద్రబాబు వయస్సుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదు

చంద్రబాబు పోరాటం అంతా కుమారుడు లోకేష్‌ చౌదరి కోసమే

తాడేపల్లి: ఎన్నేళ్లు అధికారంలో ఉన్నామన్నది కాదని, ఎంత గొప్పగా పాలించామన్నది ముఖ్యమని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. చంద్రబాబు పోరాటమంతా ఆయన కుమారుడు లోకేష్‌ చౌదరి కోసమే అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌పై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పేర్ని నాని ఫైర్‌ అయ్యారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన కొడాలి నానితో కలిసి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు దేవుళ్లతో నాటకాలాడుతున్నారని ..అందుకే ఆయనకు తగిన శాస్తి జరిగిందన్నారు. భూదేవితో ఆడుకుంటున్నారని, త్వరలోనే మట్టికొట్టుకుపోవడం ఖాయమని హెచ్చరించారు. గతంలో పార్లమెంట్‌ మెట్ల వద్ద ముద్దులు పెట్టిన చంద్రబాబు..అమరావతిలో కూడా అదేవిధంగా ఫొటోకు ఫోజులు ఇస్తున్నారని విమర్శించారు. పేదలకు సీఎం వైయస్‌ జగన్‌ ముద్దులు పెడతారు..దొంగలకు పిడిగుద్దులు పెడతారని చెప్పారు. సీఎం వైయస్‌ జగన్‌పై చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  దేవుళ్లతో నాటకాలాడితే చంద్రబాబు తగిన శాస్తి జరగడం ఖాయమని హెచ్చరించారు. ఎవరైనా భూదేవితో నాటకాలు ఆడితే మట్టికొట్టుకుపోతారన్నారు.  సీఎం వైయస్‌ జగన్‌ రాజధాని ప్రాంతంలో 50 వేల మంది పేదలకు నిలువ నీడ కల్పిస్తామంటే అడ్డుకున్నవారు రైతులు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని మీకోసం దర్శించుకున్నానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అమ్మవారికి దొంగ దండాలు పెట్టింది తన వారి కోసం కాదా అని చంద్రబాబును నిలదీశారు. అమ్మవారి గురించి మాట్లాడే ముందు గత చరిత్రను చూసుకోవాలన్నారు. గతంలో అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు చేయడం వల్లే కదా ఇవాళ అధికారం కోల్పోయిందని ప్రశ్నించారు. మనసులో ఒకటి పెట్టుకొని అమ్మ దర్శనం పెట్టుకుంటే ఇంతకంటే శాస్తి జరుగుతుంది. వైయస్‌ జగన్‌ రెడ్డి అంటూ పవన్‌ కళ్యాణ్‌ మాదిరిగా అంటున్నారని తప్పుపట్టారు. 18 నెలల్లో జగన్‌ రెడ్డి ఏం పీకారని చంద్రబాబు అంటున్నారని, ఆయన తన వయసుకు తగ్గ మాటలు మాట్లాడటం లేదని ఫైర్‌ అయ్యారు. మీ భాష ప్రకారమే వైయస్‌ జగన్‌ రెడ్డి పీకడం మొదలుపెట్టగానే.. తీగలాగగానే గుంటనక్కలాగా కోట్లు కోట్లు నీవు దోచిన సొమ్మును, పెద్ద పెద్ద నల్ల కోట్ల వెనుక దాక్కున్నది ఎవరూ..చంద్రబాబు చౌదరి కాదా? నీవు ఏ బొక్కలో దాక్కున్నా..స్టేలు ఎత్తేసే రోజు వస్తుంది. తొందర్లోనే ఉంది కంగారు వద్దు..చంద్రబాబు చౌదరి గారు ఇన్‌ఫ్రెంట్‌ కోకోడైల్‌ ఫెస్టివల్‌..నిజం చెప్పే రాజకీయాలు ఈ రాష్ట్రానికి నూటికి నూరుపాళ్లు అవసరం. అందుకే కదా చంద్రబాబును ఇంటికి పంపించి..చెప్పిందే చేసేవాడిగా, వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌ను 151 స్థానాల్లో ఘన విజయం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్నారు. చంద్రబాబు ఈ పోరాటం మీ కోసం కాదు.. మీ కుమారుడు లోకేష్‌ కోసమే. చంద్రబాబు అధికారంలో ఉండింది 13 సంవత్సరాల ఆరు మాసాలు మాత్రమే అని గుర్తించుకోవాలి. 22 ఏళ్లు అధికారంలో ఉన్నానని తప్పుడు లెక్కలు చెప్పుకుంటున్న చంద్రబాబూ ..ఎన్నేళ్లు అధికారంలో ఉన్నామని కాదు..ఎంత గొప్పగా ప్రజలకు మేలు చేశామో అన్నది ముఖ్యం. ఊర్లో రాగి చెట్టుకు, తాటి చెట్టుకు కూడా వయస్సు వస్తుందని గుర్తించుకోవాలి. రెఫరెండం పెట్టమని చంద్రబాబు బతిమాలుతున్నారు. చంద్రబాబు ప్రస్తుతం వయసు 77 ఏళ్లు . ఇంకా నీవు రాజకీయాల్లో ఉన్నా..లేకపోయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇకనైనా ఇలాంటి ప్రేలాపనలు మానుకొని..పేద ప్రజలకు, రైతులకు మంచి చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి భుజం తట్టి ప్రోత్సహిస్తే పదికాలాలు ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను తలుచుకుంటారని మంత్రి పేర్నినాని హితవు పలికారు.

 

Back to Top