మోకా మృతదేహాన్ని చూసి మంత్రి పేర్ని నాని భావోద్వేగం

మచిలీపట్నం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మోకా భాస్కర్‌రావు మచిలీపట్నంలో దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని మోకా భాస్కర్‌రావు మృతదేహాన్ని సంద‌ర్శించారు. భాస్క‌ర్‌రావు మృత‌దేహానికి నివాళులర్పిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. హత్యకు గురైన భాస్కర్‌రావు కుటుంబాన్ని మంత్రి పేర్ని నాని ఓదార్చారు. 

కాగా, మున్సిపల్‌ చేపల మార్కెట్‌లో ఉన్న భాస్కర్‌రావును దుండగులు కత్తితో పొడిచి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. దుండగులు పక్కా ప్లాన్‌తో సైనేడ్‌ పూసిన కత్తితో భాస్కర్‌రావును హత్య చేసినట్లుగా తెలుస్తోంది. భాస్కర్‌రావు హత్యకు గురయ్యాడని తెలిసిన వెంటనే వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top