త్వరలోనే పూర్తిస్థాయి బిల్లుతో ముందుకు వస్తాం

 మంత్రి పేర్నినాని
 

 అమరావతి: మూడు రాజధానుల పరిపాలన వికేంద్రీకరణ బిల్లును వెనక్కు తీసుకుంటున్నట్లు రాష్ట్రశాసన సభ ప్రకటించింది. ఈ సందర్భంగా మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. రాజధాని వికేంద్రీకరణపై ప్రజల్లో కొంత అపోహ ఉందని మంత్రి పేర్నినాని తెలిపారు. ఈ క్రమంలో.. మరోసారి అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుంటామని తెలిపారు.

ఈ వికేంద్రీకరణ బిల్లు ఎందుకు పెట్టాం.. మూడు రాజధానుల అంశంపై మరోసారి ప్రజలకు స్పష్టంగా తెలియజేస్తామని తెలిపారు. ఆయా జిల్లాల ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోని..  త్వరలోనే పూర్తిస్థాయి బిల్లుతో ముందుకు వస్తామని  మంత్రి పేర్నినాని స్పష్టం చేశారు.

అదే విధంగా.. వరదలు, వర్షాలపై మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. ప్రతి ఇంటికి రూ. 2 వేలు, ఇతర నిత్యవసరాలు అందిస్తామని పేర్కొన్నారు. పునరావాసం కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దీనికోసం ప్రజలు.. 104 సేవలను.. నాలుగు జిల్లాలకు మరింత విస్తృతంగా విస్తరిస్తున్నామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులున్న104 సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విధినిర్వహణలో ముగ్గురు ఉద్యోగులు చనిపోయారని.. వారి కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. భారీ వరదలకు.. 10 మంది మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. వీరి కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు.

అదే విధంగా పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో రైతులకు విత్తనాలు సరఫరా చేస్తామని .. నష్టపోయిన ప్రతి రైతుకి ప్రభుత్వం తరపున పరిహారం ఇస్తామని తెలిపారు. వరద బీభత్సాన్ని ఎదుర్కొవడానికి అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్నామని మంత్రి పేర్నినాని తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top