సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లకు ఇచ్చిన హామీని నేరవేర్చారని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. అర్హులైన ఆటో యజమానులకు వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా రూ.10 వేల ఆర్థికసాయం అందించామని తెలిపారు. ఆటో మీద జీవించే వారికి ఈ పథకం వర్తింపజేశామని, అర్హులందరిని విస్తృతంగా గుర్తించి రెండో విడతలో కూడా వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు చెల్లించినట్లు తెలిపారు. మొదటి విడతలో మిగిలిపోయిన వారిని రెండో విడతలో గుర్తించామన్నారు. రెండో విడతలో 65,054 మంది దరఖాస్తు చేసుకోగా, 62, 630 మందిని లబ్ధిదారులుగా గుర్తించి ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయం ఈ రోజు మంత్రి పేర్నినాని మంజూరు చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లబ్ధిదారుల ఖాతాల్లోకి మంత్రి పేర్ని నాని డబ్బులు జమా చేశారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్నినాని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏలూరులో వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకాన్ని ప్రారంభిస్తున్న సమయంలో ఇంకా ఎవరైనా మిగిలిపో్యిన వారు ఉంటే అక్టోబర్ మాసం వరకు గడువు పెంచారన్నారు. భార్య పేరు మీద ఆటో ఉంటే భర్తకు డబ్బులు ఇచ్చామన్నారు. మార్పులు, చేర్పులు చేసి సులభతరం చేశామన్నారు. వెసులుబాటు కలిగించిన తరువాత 65054 మంది ఆక్టోబర్ మాసం వరకు దరఖాస్తు చేసుకోగా, వారిలో 62637 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వారందరికీ కూడా రెండో విడత కింద ఈ రోజు డబ్బులు జమా చేస్తున్నామన్నారు. 14528 మంది ఎస్సీలు, 2714 మంది ఎస్టీ, 26960 బీసీలు, 8196 మంది మైనారిటలు, 6681 మంది ఓసీల్లోని కాపులు, 112 మంది బ్రాహ్మణవర్గానికి చెందిన వారు. 3487 మంది ఈబీసీలుగా గుర్తించామని, 245 మందిని క్రిస్టియన్ మైనారిటీలుగా గుర్తించామన్నారు. వీరందరి ఖాతాల్లోకి ఈ రోజు డబ్బులు జమా చేస్తున్నామన్నారు. మొత్తంగా వైయస్‌ఆర్ వాహన మిత్ర పథకంలో 2,39, 957 మంది దరఖాస్తులు చేసుకోగా వీరిలో 2,36,346 మందికి లబ్ధి చేకూరిందన్నారు. వచ్చే ఏడాది కూడా కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామన్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైయస్‌ఆర్ వాహన మిత్రకు రూ.236 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.10 వేల చొప్పున డబ్బులు అందజేసినట్లు చెప్పారు. వైయస్ జగన్ చెప్పిన మాట మేరకు ప్రతి అధికారి ప్రతి రోజు ఈ పథకంలో ఎక్కువ మందిని లబ్ధిదారులను గుర్తించేందుకు కృషి చేశారన్నారు. అధికారులందరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా లబ్ధిదారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. Read Also: సీఎం వైయస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభం