సీఎం వైయస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభం

 

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ సచివాలయంలో కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. కేబినెట్‌ సమావేశానికి మంత్రి మండలి సభ్యులు హాజరయ్యారు. కేబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలపై సీఎం వైయస్‌ జగన్‌ మంత్రిమండలితో చర్చించనున్నారు. వైయస్‌ఆర్‌ నవశకం పథకాలపై,  కొత్త పెన్షన్‌ కార్డులు, పెన్షన్‌ అర్హతల మార్పులపై చర్చించనున్నారు. అదే విధంగా  రైస్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, విద్యా దీవెన కార్డుల జారీ విధి విధానాలపై కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన పథకం వర్తింపుపై, డిగ్రీ ఆపై ఉన్నత విద్యా కోర్సులు చదివే విద్యార్థులకు జగనన్న వసతి పథకం కింద రూ. 20 వేలు చెల్లింపుపై, వైయస్‌ఆర్‌ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు ప్రతిపాదనలపై, సీఆర్‌డీఏలో జరుగుతున్న పలు నిర్మాణాలపై, కొత్త బార్‌ పాలసీపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు సమాచారం.

Read Also: రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు

Back to Top