పత్రికా సమాజం ఏమైంది? 

టీవీ9 దీప్తి, ఎన్‌టీవీ హరీష్‌, మహాటీవీ వసంతపై దాడిని ఖండిస్తున్నాం

బాధిత జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉంటుంది

మీడియా ప్రతినిధులపై దాడి జరిగితే ఖండించకపోవడం సరికాదు

జర్నలిస్టులను కొట్టిన వారిని చంద్రబాబు, లోకేష్‌ సమర్ధించడం దారుణం

 

తాడేపల్లి: తోటి జర్నలిస్టులపై విచక్షణారహితంగా దాడులు చేస్తే పత్రికా సమాజం, సంఘాలు ఏమయ్యాయని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. మీడియాలో పని చేస్తున్న కొందరు విలేకరులపై విచక్షణరహితంగా దాడి చేస్తే..మిగతా విలేకరులు ఏం చేస్తున్నారు. హీనాతిహీనంగా దాడులు చేస్తున్నా కొందరు పాత్రికేయులు పట్టించుకోకపోవడం బాధాకరం. అక్రిడేషన్‌ పాసుల కోసం మీడియా సంఘాలు వస్తాయి. కానీ పాత్రికేయులపై దాడి చేస్తే నోరు మెదపడం లేదు. తప్పుడు వార్తలు రాస్తే..వివరణ ప్రచురించాలి. లేదంటే లీగల్‌గా పరువు నష్టం వేసే అధికారం కల్పిస్తూ ఓ జీవో ఇస్తే బజారు ఎక్కి పోరాటం చేసిన వాళ్లు..మీ తోటి ఉద్యోగులపై దాడి చేస్తే..ఏమైంది పత్రికా సమాజం. టీవీ 9 దీప్తి, ఎన్‌టీవీ హరిష్‌, మహాటీవీ వసంత, కెమెరా మెన్స్, వారి కారు డ్రైవర్లను చితకకొట్టారు. ఈ దాడిని ఖండించకపోవడం బాధాకరం. దాడిలో గాయపడిన వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది. మీరు స్థైర్యాన్ని కోల్పోవద్దు. మీపై దాడి చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఆడపిల్లను క్రురంగా కర్రలతో కొడితే..సానుభూతి చూపకుండా..చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్‌ దాడి చేసిన వారికి సపోర్టు చేస్తున్నారు. చింతమనేని ప్రభాకర్‌  ఇంటికి వెళ్లిన చంద్రబాబు..టీడీపీ నేతలకు ఇదే స్ఫూర్తితో పని చేయమని పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రవర్తనను ఖండిస్తున్నాం. సోషల్‌ మీడియా యాక్టివిస్టులు పోస్టులు పెడుతున్నారు. టీవీ 9 మేం చెప్పినట్లు వార్తలు రాయడం లేదని పోస్టులు పెడుతున్నారు. టీవీ5, ఏబీఎన్‌, ఈటీవీని ఎప్పుడైనా వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు ఏమైనా చేశారా? ఇటువంటి దుర్మార్గమైన చర్యలను సమర్ధించే ప్రవర్తనను మానుకోవాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 33 వేల ఎకరాలను బలవంతంగా తీసుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతలను నిలదీస్తే 78 మందిపై కేసులు పెట్టారు. సీపీఐ, సీపీఎం, వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై కేసులు పెట్టారు. విలేకరులకు, యాజమాన్యానికి సంబంధం ఏముంది. రైతులైతేనేమి విలేకరులను కొడతారా? చంద్రబాబు బస్సులో వెళ్తే ఒక రాయి పడిందని గగ్గోలు పెట్టారు. ఇవాళ విలేకరులను ఎందుకు కొట్టారు. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతారు. మనిషి కష్టం తెలిసిన వారు రైతులు. ఇవాళ విలేకరులను కొట్టిన వారిపై సాక్షాలు ఉన్నాయి. ఇలాంటి దాడులు ఖండిస్తున్నాం. 2020 నూతన సంవత్సరం 52 వేల ఆర్టీసీ ఉద్యోగులకు నిజమైన నూతన సంవత్సరం కాబోతుంది. ఇందుకు సీఎం వైయస్‌ జగన్‌కు పాదాభివందనాలు అంటూ పేర్నినాని పేర్కొన్నారు.

సుజనా భాష తెలుగు దేశానిది, భావం బీజేపీది కాదు
రాజధాని విషయంలో కేంద్రం చూస్తూ ఊరుకోదని సుజనా చౌదరి అంటున్నారు. సుజనా చౌదరిది భారతీయ తెలుగు దేశం పార్టీ, ఆయన భారతీయ జనతా పార్టీ గురించి ఎలా మాట్లాడుతారు. భాష తెలుగు దేశానిది, భావం బీజేపీది కాదు. చట్టరీత్యా, రాజ్యంగ పరిధిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో వేలు పెట్టే అవకాశం ఉంటే పెట్టవచ్చు. దాంట్లో మాకేం లేదు. సీఎం వైయస్‌ జగన్‌ ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగానికి, చట్టానికి లోబడి పరిపాలన సాగిస్తున్నారు. పవన్‌ నాయుడు ప్రజల కోసం పని చేస్తారో లేదో ప్రజలందరికీ అర్థమైంది. ఆయన పర్యటన మాట, అడుగు ప్రతిదీ ఆయన ప్రేమించే వ్యక్తుల కోసమే ఉంటాయి. వైయస్‌ జగన్‌ను కూడా పవన్‌ నాయుడు ఒక కోరిక కోరారు. వైయస్‌ జగన్‌ మంచి పరిపాలన అందిస్తున్నారు. పవన్‌ కోరిక మేరకు మంచి పరిపాలన అందిస్తున్నారు. త్వరలోనే పవన్‌ సినిమాల్లోకి వెళ్తారు.

 
అధిక చార్జీలు వసూలు చేస్తే ఫిర్యాదు చేయండి
 పండుగల నేపథ్యంలో ప్రైవేట్‌ బస్సులు అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. అధిక చార్జీలు వసూలు చేస్తే వాట్సాప్‌ నంబర్‌ 8309887955 ఫిర్యాదు చేయాలన్నారు. అధిక చార్జీలు వసూలు చేసిన బస్సులు మన రాష్ట్ర బార్డర్‌లోకి రాగానే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్‌ బస్సు యజమానులకు కూడా వినమ్రంగా తెలియజేస్తున్నామని..దయచేసి బస్సు ప్రయాణికులను  దోపిడీ చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. సంక్రాంతి పండుగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దూరప్రాంతాలకు నడిపే ఆర్టీసీ సర్వీసుల్లో ఎలాంటి చార్జీలు పెంచడం లేదన్నారు. పండుగ రద్దీ దృష్ట్యా సిటీ బస్సులు, అల్ట్రా బస్సులను వేరే ప్రాంతాలకు ఖాళీ బస్సులను నడిపి అక్కడి నుంచి ప్రయాణికులను తీసుకురావాల్సి వస్తుంది. అందుకోసం 50 శాతం చార్జీలు పెంచుతున్నాం. ప్రయాణికులు అర్థం చేసుకోవాలి. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top