మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

బాబు హయాంలో డ్వాక్రా మహిళలు అప్పుల్లో కూరుకుపోయారు

నాడు బాబు వస్తే జాబొస్తుందన్నారు..ఉన్న ఉద్యోగాలు తీసేశారు

ఒంగోలు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఒంగోలులో ఏర్పాటు చేసిన రెండో విడత ఆసరా కార్యక్రమం ప్రారంభోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడారు.

ఎన్నికలకు ముందు వైయస్‌ జగన్‌ 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రజల ఇబ్బందులను గమనించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో రెండున్నరేళ్లకే S 95 శాతం అమలు చేశారు. 2014కు ముందు చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి మోసం చేశారు. చంద్రబాబు మాటలు నమ్మిన మహిళలు తమ సంఘాలను అప్పుల ఊబిలోకి నెట్టుకున్నారు. ఏప్రిల్‌ 11, 2019 నాటికి 7 లక్షలకు పైగా సంఘాలు ఉండగా దాదాపుగా రూ.25,514 కోట్ల అప్పులు ఉన్నాయి. దాన్ని ఆసరాగా రూపొందించి గతేడాది సెప్టెంబర్‌ 11, 2020లో రూ.6318 కోట్లు మొదటి విడతలో చెల్లించారు. 2016 నుంచి చంద్రబాబు సున్నా వడ్డీ  ఇవ్వలేదు. రూ.2361 కోట్లు మన ప్రభుత్వం, మన నాయకుడు చెల్లించారు. వైయస్‌ఆర్‌ ఆసరా, చేయూత డబ్బులను సద్వినియోగం చేసుకునేందుకు మల్టీ నేషనల్‌ కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వ్యాపార మార్గాలను సీఎం వైయస్‌ జగన్‌ చూపించారు. రెండో విడత రూ.6439.52 కోట్లు మహిళలకు ఇస్తున్నారు. గతంలో కరోనా వంటి కష్ట సమయంలో కూడా మొదటి విడత డబ్బులు చెల్లించారు. ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆసరా సొమ్ము మీ ముందుకు వచ్చి ఉత్సవంలా చెల్లిస్తారు. 
గతంలో చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారు..ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. బాబు వచ్చాడు..ఉన్న ఉద్యోగాలు తీసేశాడు. రైతుల కోసం ఏ రోజు ఆయన ఆలోచన చేయలేదు. గతంలో వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. మహిళ సంఘాలను దివాళ తీయించారు. నిబద్ధత గల వ్యక్తి సీఎం అయితే పరిపాలన ఏ విధంగా ఉంటుందో చేసి చూపిస్తున్నారు. శక్తిసామర్థ్యాలు ఉన్న వ్యక్తిని గౌరవించాలి, ఆశీర్వదించాలి..అండగా ఉండాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. 

 

Back to Top