40 ఏళ్ల అవినీతి చక్రవర్తి పాపం పండింది

చంద్రబాబు చేసిన స్కామ్‌లన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి

విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

చిత్తూరు: చంద్రబాబు చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన అవినీతి చక్రవర్తి పాపం పండిందని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు అవినీతి చిట్టా చాలా పెద్దదని, కేవలం ఒక్క స్కామ్‌లోనే చంద్రబాబు జైలుకు వెళ్లారన్నారు. అన్ని రకాల మేనేజ్‌మెంట్లతో 40 ఏళ్లు ఎవ్వరికీ దొరకని దొంగగా ఉన్న చంద్రబాబు.. వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ పబ్బం గడుపుకున్నాడన్నారు. స్కిల్‌ స్కామ్‌లో సీఐడీకి సాక్షాధారాలతో దొరికిపోయాడన్నారు. చిత్తూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

సుప్రీం కోర్టులో వైయస్‌ విజయమ్మ వేసిన పిటీషన్‌పై కూడా చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడని, దేనికైన ఓ హద్దు ఉంటుందని, ఆ హద్దు దాటిపోయాడు కాబట్టి చంద్రబాబు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. ఇంకా చాలా కుంభకోణాలు బయటకు వస్తాయని, స్కిల్‌ స్కామ్‌ మొదటి మెట్టు మాత్రమేనన్నారు. చంద్రబాబు అవినీతిపరుడని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. చేసిన తప్పును సమర్థించుకునేందుకు పలుకుబడిని ఉపయోగించి వ్యవస్థలను మేనేజ్‌ చేసుకుంటూ వస్తాడని, చంద్రబాబు అవినీతి బాగోతం ప్రజలందరికీ అర్థమైందన్నారు. కాబట్టే ప్రజల నుంచి బాబుకు ఎలాంటి మద్దతు లభించడం లేదని చెప్పారు.  
 

తాజా వీడియోలు

Back to Top