అనుభవం ఉంటే త‌ప్పు చేసినా అరెస్టు చేయకూడదా..?

స్కిల్ స్కామ్‌లో రూ. 371 కోట్లు నొక్కేసిన అవినీతిపరుడు బాబు

హవాలా మార్గంలో ఆ డబ్బులన్నీ బాబుకే చేరాయి

చంద్ర‌బాబు అరెస్టును వ‌క్రీక‌రిస్తూ ఎల్లో మీడియా ప్ర‌చారం

ఆధారాల‌తో అడ్డంగా దొరికిపోయిన బాబుకు సింప‌థీ కూడ‌గ‌ట్టే ప్ర‌య‌త్నం

చంద్ర‌బాబు అవినీతిపై పురందేశ్వ‌రి, ద‌త్త‌పుత్రుడు, క‌మ్యూనిస్టులు నోరు తెర‌వ‌రేంటీ..? 

విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

తిరుపతి: స్కిల్‌ స్కామ్‌లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు అరెస్టు అయ్యారని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.371 కోట్ల ప్రజాధనాన్ని షెల్‌ కంపెనీలకు తరలించి లూటీ చేశాడని విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సాక్ష్యాధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబును ఎల్లో మీడియా సమర్థిస్తోందని, అరెస్టును వక్రీకరిస్తూ ప్రజల నుంచి సింపథీ పొందేందుకు విశ్లేషణలు చేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడే ఉద్దేశపూర్వకంగా స్కిల్‌ స్కామ్‌లో ఇరుక్కున్నాడని, స్కామ్‌కు సంబంధించిన వివరాలన్నీ సీఐడీ వెలికి తీసిందని చెప్పారు. విచారణ కొనసాగితే దీంట్లో ఉన్నవారందరూ బయటకు వస్తారన్నారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు డైవర్షన్, ఫైబర్‌ నెట్‌ అవకతవకల్లో లోకేష్‌ పాత్ర ఉందని, విచారణ తొందరలోనే పూర్తి చేస్తామని సీఐడీ అధికారులు చెప్పారన్నారు. తిరుపతిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. 

స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. రాజకీయ అనుభవం ఉంటే, స్కాములు చేస్తే అరెస్టు చేయరా..? కొన్ని మీడియా సంస్థలు చంద్రబాబు అరెస్ట్ తప్పు అంటూ వాదనలు చేస్తున్నారు. మొత్తం రూ. 3, 356 కోట్ల ప్రాజక్ట్ లో 90 శాతం సీమెన్స్ కంపెనీ, 10 శాతం, అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన ప్రాజెక్టులో.. ప్రభుత్వ డబ్బును మాత్రం వెంట‌నే రిలీజ్ చేయించి, రూ. 371 కోట్లు చంద్రబాబు అండ్ కో మింగేశారు. ఏ కారణం లేకుండా ఒక ప్రైవేటు కంపెనీ- ప్రభుత్వం తరపున రూ. 3000 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తుంది..? ఈ చిన్న లాజిక్ కూడా తెలియకుండా, చంద్రబాబు స్కామ్ చేశాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు, ఈడీలు విచారణలు జరిపి, అరెస్టులు చేశాయి. 

సీమెన్స్, డిజైన్ టెక్, స్కిల్లర్ కంపెనీల ప్రతినిధులను ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ చేశారు.  వారిలో వారిలో సీమెన్స్‌ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్, డిజైన్‌ టెక్‌ సిస్టమ్స్‌ ఎండీ వికాస్‌ నాయక్‌ కన్వేల్కర్, అదే కంపెనీకి చెందిన మాజీ ఫైనాన్స్‌ అడ్వయిజర్ ముకుల్‌ చంద్ర అగర్వాల్, స్కిల్లర్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన సురేష్‌ గోయల్‌ అనే చార్టెడ్‌ అకౌంటెంట్‌ను కూడా అరెస్టు చేశారు. వీరందరికీ కోర్టు కస్టడీ విధించింది. వీరంతా భారీ కుంభకోణంలో పాత్రదారులని తేల్చారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. కేవలం ప్రభుత్వం 10 శాతం కింద ఇచ్చిన 371 కోట్ల రూపాయలను మింగేశారు. షెల్ కంపెనీల ద్వారా, హవాలా మార్గంలో డబ్బులు బదలాయించారు.

ఆ డబ్బులు అన్ని చంద్రబాబుకు, ఆ పార్టీ వారికి చేరాయి. ఇది చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన స్కాం కాబట్టే.. ఆయన ఈ విషయం పై ఏమి మాట్లాడలేదు. ఆయన పార్టీ వారిని పెట్టుకుని అడ్డగోలుగా వాదిస్తుంటే.. చంద్రబాబు సిఐడిని నిలదీశారని ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటుంది. ఐటీ నోటీసులు ఇస్తే... ఆ సర్కిల్ నోటీసు ఇవ్వకూడదని అడ్డోగొలు చంద్ర‌బాబు వాదనలు చేశారు. ప్రభుత్వ ధనాన్ని దోచేయలనే కుట్రతో ఈ మొత్తం వ్యవహారం జరిగింది. అన్ని ఆధారాలతోనే చంద్రబాబు నాయుడిని సిఐడి అరెస్ట్ చేసింది. 

చంద్రబాబు బంధువు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్, సీపీఐ నారాయణ, రామకృష్ణ వీళ్ళందరి కళ్ల‌కు ఈ స్కాము క‌నిపించ‌డం లేదా..? అరెస్టును క‌క్ష సాధింపు చర్యగా వ‌క్రీక‌రించ‌డం దౌర్భాగ్యం. పురంధేశ్వరి ఈ 371 కోట్లు చంద్రబాబు తిన్నారా లేదా అని చెప్పాలి.  అప్పుడున్న సీపీఐ నారాయణ , ఇప్పుడు ఉన్న నారాయణ వేరు. అప్పటి నారాయణ కమ్యునిస్ట్ భావజాలం కలిగిన వారు.. ఇప్పుడు చంద్రబాబు భావజాలంతో పని చేస్తున్నారు. 

ఓటుకు నోటు కేసులో కూడా ఇదేవిధంగా అడ్డగోలుగా వాదించిన వ్యక్తి చంద్రబాబు. ఆనాడు కూడా ఎల్లో మీడియా ఇదేవిధంగా చంద్రబాబు కు మద్దతుగా త‌ప్పును స‌మ‌ర్థించింది. ఎన్టీఆర్ ఘటన సమయంలో, ఇప్పుడు కూడా కొన్ని మీడియా సంస్థలు అదే పని చేస్తున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఆయనను కుట్ర పూరితంగా అరెస్ట్ చేశారని మాట్లాడుతున్నారు. సిఐడి ఈ కేసును పూర్తి స్థాయిలో వెలికితీసి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన్ను ఆరెస్ట్ చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఏపి ఫైబర్ నెట్  స్కాముల్లో కూడా అవకతవకలు జరిగాయి.. అవికూడా విచారిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పుంగనూరు అల్లర్ల సమయంలో ఒక్క వైసీపీ కార్యకర్త కూడా లేరు. రూట్ మ్యాప్ మార్చి పుంగనూరు లోకి ప్రవేశించాలని నాడు చంద్రబాబు చూస్తే.. పోలీసులు అడ్డుకున్నారు. ఆరోజు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘటన జరిగింది`` అని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top