చిత్తూరు: పాదయాత్ర సమయంలో..ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేసిన గొప్ప నాయకుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3వ విడత వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం.. అంబేద్కర్ భవన్‌లో మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో సీఎం వైయస్ జగన్‌కు అనేకమంది మహిళలు తమ కష్టాలు తెలిపారని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారని మహిళలు ఆవేదన వ్యక్తం చెందారన్నారు. అందుకే.. సీఎం వైయస్ జగన్ మహిళల కష్టాలను విని.. నవరత్నాలులో వైయస్ఆర్ ఆసరాను పొందుపరిచారన్నారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో వైయస్ఆర్‌సీపీ విజయం సాధించిందన్నారు. రెండో మూడో ఎమ్మెల్సీలు గెలవగానే.. అధికారంలోకి వచ్చామని చంద్రబాబు సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కంటే వైయస్ఆర్ సీపీకి మరిన్ని స్థానాలు అధికంగా వస్తాయి తప్ప, ఎక్కడా సీట్లు తగ్గవని ధీమా వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబులాగా సీఎం వైయస్ జగన్ రైతులను, మహిళలను మోసం చేయలేదని పెద్దిరెడ్డి చెప్పారు.
అంతకుముందు.. వ్యవసాయానికి అండగా నిలవడం, రైతులకు చేయూత నివ్వడంలో సీఎం జగన్ అందరి కన్నా ఒక అడుగు ముందే ఉన్నారని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. వైయస్ఆర్ జలకళ కింద కమాండ్ ఏరియాతో పాటు నాన్-కమాండ్ ఏరియాలోనూ అర్హులైన రైతులకు ప్రభుత్వం ఉచితంగా బోర్ బావులను మంజూరు చేస్తోందన్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ ఉపకరణలతో పాటు 180 మీటర్ల కేబుల్‌ను కూడా రైతులకు ఉచితంగానే అందచేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2020 నుంచి 2024 వరకు మొత్తం రెండు లక్షల బోర్లు వేస్తామని చెప్పామని.. మొత్తం మూడు లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తామని.. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే లక్ష్యంతో వైయస్ఆర్ జలకళ పథకంను అమలు చేస్తున్నామని తెలియజేశారు.