త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు ఇంధనశాఖ కృషి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అమరావతి:  రాష్ట్రంలో త్వరితగతిన పరిశ్రమల ఏర్పాటుకు ఇంధనశాఖ కృషి చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై అసెంబ్లీలో శనివారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.
ఈ రోజు రాష్ట్రంలో అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయి కాబట్టి అన్నిరంగాల్లో ఎంవోయూలు, ఎంవోఏలు చేసుకుంటున్నారు. పరిశ్రమల రంగంలో విద్యుత్‌ శాఖ వెన్నెముక లాంటిది. ప్రతి పరిశ్రమకు అవసరమైన విద్యుత్‌ను అందించేది మా శాఖే. సీఎం వైయస్‌ జగన్‌ అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దేశంలోనే ఈ రోజు ఏపీ ఇంధన శాఖ ఎదిగింది. ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో ఎంవోయూలు రూ.7,69,815 కోట్లలకు జరిగితే ఎంవోఏలు రూ.1,15,700 కోట్లు ఉన్నాయి. మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూలలో ఇంధన శాఖకే రూ.9.8 లక్షల కోట్లు వచ్చాయి. గతంలో చంద్రబాబు కూడా చాలా ఎంవోయూలు చేశారు. 2016లో చంద్రబాబు రూ.88,182 కోట్లతో ఎంవోయూలు చేస్తే 23,750 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. 2017లో రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుంటే 45,895 మందికి ఉపాధి కల్పించాలని చేస్తే ఇందులో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. 
మాది చేతల ప్రభుత్వం కాబట్టే అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నాం. మా ఒప్పందాలు అన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. ఇందుకు సంబంధించి ప్రత్యేక కమిటీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలకు అవసరమైన చర్యలు ఈ కమిటీలు తీసుకుంటాయి. సీఎం వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో కొన్ని పాలసీలు తీసుకువచ్చాం. వినియోగంలో ఉండే భూమి, నీళ్లు అన్నీ కూడా కొత్త పాలసీలు తీసుకువచ్చాం. ఏ రాష్ట్రానికి కూడా పవన్‌ ఇచ్చేలా పాలసీలు తీసుకువచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి. ఎంవోయూలు వచ్చాయి. 29 పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులు తీసుకువచ్చాం.
 

Back to Top